Begin typing your search above and press return to search.
జైలుకెళ్లినా, ప్రజలు ఓడించినా మారని కూన రవికుమార్
By: Tupaki Desk | 2 March 2020 7:00 AM GMTఅధికారం ఉన్నన్నాళ్లు రెచ్చిపోయి అధికారులూ అని చూడకుండా ఇష్టమొచ్చిన తీరున ప్రవర్తించాడు.. ప్రజలకు ఏనాడూ మేలు చేయలేదు.. రౌడీయిజం చేస్తూ ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాడు. అతగాడి ప్రవర్తనతో విసుగెత్తిన ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పి అతడిని ఎమ్మెల్యే కాకుండా చేశారు. అయినా అతడి వైఖరిలో బుద్ధి రాలేదు. అధికారం లేకున్నా.. ఆయన ఎమ్మెల్యే కాకున్నా ఇంకా అధికారులపై పెత్తనం చలాయిస్తున్నాడు. మదమెక్కి ప్రభుత్వ అధికారులపై బూతు పురాణం అందుకున్నాడు. తాజాగా మరో అధికారిని దూషిస్తున్న ఫోన్ కాల్ రికార్డు వైరలైంది. అతగాడే ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూన రవికుమార్.
శ్రీకాకుళం జిల్లాలో రౌడీయిజం అంటే ముందుగా గుర్తొచ్చేది కూన రవికుమారే. అంతగా పేరు మోసాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను దూషిస్తూ.. బండ బూతులు తిడుతూ అధికారులపై, ఇటు ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఆ ప్రవర్తనే అతడికి గుణపాఠం చెప్పాయి. గతంలో అధికారులను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బెయిల్ పై ఉన్న అతగాడి దురుసుతనం, రౌడీయిజం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సరుబుజ్జిలి అధికారిపై బూతు పంచాంగం అందుకున్నాడు. ఆ అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నా.. అని చెబుతున్నా ఆయన వినిపించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. నీవు.. అధికారివా నా కొడకా.. ఎక్కడైనా వచ్చి పాతిపెడతా అంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాడు. వైజాగ్ లో ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టనని బండ బూతులు తిట్టాడు. ఆ అధికారి ఇంకా సార్.. సార్ అంటూ ఉన్నా అతడు తీవ్ర దుర్భాషలాడాడు. దానికి సంబంధించిన కాల్ రికార్డులు బహిర్గతమయ్యాయి.
రావివలస పంచాయతీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ప్రశ్నించాడు. గతంలో కూడా పలువురు అధికారులను దుర్భాషలాడాడు. జైలుకెళ్లొచ్చినా.. ప్రజలు ఓడించినా అతడి ప్రవర్తన లో ఎలాంటి మార్పు రాలేదు.