Begin typing your search above and press return to search.

పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీదే గెలుపా?

By:  Tupaki Desk   |   23 Oct 2022 5:01 AM
పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీదే గెలుపా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని త‌పిస్తున్న టీడీపీకి అనూహ్యంగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం.. అప్పుడే.. పార్టీ ఖాతాలో ప‌డిపో యింది. అదేంటి.. అస‌లు ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌లేద‌ని.. ఇదెలా సాధ్య‌మ‌ని అనుకుంటున్నారా? ఇది సాధ్య‌మేన‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పామ‌ర్రులో టీడీపీ దూకుడు పెరిగింది. పార్టీ పొల‌ట్ బ్యూరో స‌భ్యుడు.. వ‌ర్ల రామ‌య్య కుమారుడు.. వ‌ర్ల కుమార్ రాజా.. రెండేళ్ల ముందుగానే ఇక్క‌డ దృష్టి పెట్టారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఉద్య‌మాలు కూడా చేస్తున్నారు.

నిజానికి ఈ ఉద్య‌మాల‌కు అనుకున్న విధంగా అనుకూల మీడియా ఫోక‌స్ పెట్ట‌క‌పోయినా.. ప్ర‌జ‌ల్లో మాత్రం చ‌ర్చ‌సాగుతోంది. నిరాహార దీక్ష‌లు.. నిర‌స‌న ల‌తో ఆయ‌న దూకుడు పెంచారు. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీలో ఉన్న నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వాన‌నించే కార్య‌క్ర‌మాల‌కు కూడా రాజా త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా.. కీల‌క నేత ఒక‌రు టీడీపీలో కి తిరి గి వ‌చ్చేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీలోఉన్న కీల‌క నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌.. రేపోమాపో.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయ‌న‌పై వైసీపీ అధిష్టానం స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీ వై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ ప్ర‌క‌టించింది. పార్టీ అధినేత వైఎస్ జగన మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీ వై దాస్ పై బహిష్కరణ వేటు వేసినట్లు వైసీపీ పేర్కొంది.

పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాస్... ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై వచ్చినట్లు వైసీపీ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి పార్టీ అధినేతకు నివేదిక అందించగా... దాస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని జగన్ ఆదేశించినట్లుగా వైసీపీ తన ప్రకటనలో తెలిపింది. అయితే.. ఈయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ పంచ‌న చేర‌నున్నారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న టికెట్ ఆశిస్తున్నా.. ఇప్ప‌టికే కుమార్ రాజాకు క‌న్ఫ‌ర్మ్ చేసినందున టీడీపీఅధికారంలోకి వ‌స్తే.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా చూస్తే.. రాజా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.