Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను అలా చేయడంలో తప్పులేదు!

By:  Tupaki Desk   |   29 Aug 2019 4:46 AM GMT
ఎన్టీఆర్ ను అలా చేయడంలో తప్పులేదు!
X
చంద్రబాబు రాజకీయ జీవితంలో సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడనే అపవాదు ఓ కీలక మచ్చగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును ‘వెన్నుపోటుకు’ బ్రాండ్ అంబాసిడర్ విమర్శిస్తుంటారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మామను కూలదోసి రాజకీయ అధికారాన్ని చంద్రబాబు చేపట్టడంలో తప్పులేదని తాజాగా మాజీ మంత్రి - టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత హాట్ కామెంట్ చేశారు.

నాడు ఎన్టీఆర్ ను డమ్మీగా మార్చి టీడీపీని గుప్పిట పట్టి పార్టీని - ప్రభుత్వాన్ని లక్ష్మీపార్వతి తన కనుసన్నల్లో నడిపించారని.. భ్రష్టు పట్టించారని.. ఆమె వల్ల టీడీపీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలు - ప్రజలు - నాయకుల భవిష్యత్ అంధకారమైందని అనిత చెప్పుకొచ్చారు. అందుకే టీడీపీని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేయడంలో తప్పులేదని వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబునాయుడు కనుక ఆరోజు ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసి సీఎంగా పగ్గాలు చేపట్టకపోయింటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏపీలో భూస్థాపితం అయ్యి ఉండేదని అనిత అభిప్రాయపడ్డారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు - రాజకీయ నాయకులు ఒప్పుకున్న మాట ఇదేనని ఆమె కుండబద్దలు కొట్టారు.

ఎన్టీఆర్ ఆనాడు తప్పు చేసినా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు - నాయకులు తెలుగుదేశాన్ని వీడలేదని అనిత చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ముందుకుసాగామన్నారు.