Begin typing your search above and press return to search.
జేసీకి ఏమైంది...చొక్కాలు చింపుకుని మరీ...!
By: Tupaki Desk | 30 April 2023 8:20 PM GMTజేసీ బ్రదర్స్ అంటేనే అనంతపురం జిల్లాలో ఒక పొలిటికల్ బ్రాండ్. ఇద్దరూ కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగారు. జిల్లాను శాసించారు. ఆ కాంగ్రెస్ ఏపీ నుంచి అంతర్ధానం అయ్యేంతవరకూ అందులోనే ఉన్నారు. ఆ మీదట టీడీపీలో చేరి అన్న జేసీ ఎంపీగా తమ్ముడు జేసీ తాడిపత్రి ఎమ్మెల్యేగా నెగ్గారు.
ఆ అయిదేళ్లూ తమ హవా పూర్తి స్థాయిలో చూపించారు. 2019లో బొమ్మ పూర్తిగా తిరగబడింది. ఏడవ క్లాస్ కూడా పాస్ కాని పెద్దా రెడ్డి మామీద పోటీనా అని ఎకసెక్కమాడారు. కానీ అదే పెద్ద రెడ్డి కొట్టిన దెబ్బ మాత్రం వీర లెవెల్ లో ఉంది. సీన్ కట్ చేస్తే జేసీ దివాకర్ రెడ్డి ఫుల్ సైలెంట్ అవగా జేసీ ప్రభాకరరెడ్డి మాత్రం ఎమ్మెల్యే నుంచి తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ స్థాయికి దిగిపోయారు.
ఇక ఈ మధ్య ఆయన చర్యలు చేష్టలు విచిత్రంగా వింతగా ఉంటున్నాయి. ఏపీలో ప్రముఖ లీడర్లమని చెప్పుకునే జేసీ బ్రదర్స్ మునిసిపల్ కమీషర్ తో గొడవ పడుతూ రోడ్డు మీద నిద్ర తిండీ స్నానం అంటూ హడావుడి చేసే దాకా వచ్చింది సీన్. అది కాస్తా ముందుకెళ్ళి జేసీ ప్రభాకరరెడ్డి చొక్కాలు చింపుకునే స్థితికి వెళ్ళిపోయారు.
ఇదంతా ఎందుకు అంటే ఫస్ట్రేషన్ అని వైసీపీ నేతలు అంటూంటే వైసీపీ మీద పోరాటం ఇలాగే ఉంటుంది అని జేసీ అంటున్నారు. ఆయన నేను దొంగ నీవు దొంగ అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ చేసిన విన్యాసాన్ని చూసి ఇదేంది బాబోయ్ అని జనం అనుకునేలా ఉంది. పెద్దా రెడ్డి ప్రజల సొమ్ముని దోచుకున్న దొంగ అయితే తాను ప్రజల మనసుని దోచుకున్న దొంగను అని ప్రభాకరెడ్డి ఆత్రేయ సినీ గీతాన్ని కొత్త పంధాలో ఆలపిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే డీజిల్ దొంగ ఎవరు అంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలను తాడిపత్రిలో ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకరరెడ్డి దొంగ అని వారు అలా కామెంట్స్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టేసరికి ప్రభాకరరెడ్డికి చిర్రెత్తుకుని వచ్చింది. అవును ఇద్దరమొ దొంగలమే కానీ నేను ప్రజలను గెలుచుకున్న దొంగను అంటూ ట్విస్ట్ ఇస్తున్నారు.
మరి ప్రజల మనసును గెలిచే వారైతే 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు బాబూ అని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ మోస్ట్ రాజకీయ నేత ఏడు పదుల వయసు దాటింది ఈ ఏజ్ లో ప్రభాకరరెడ్డి ఈ విధంగా రాజకీయ తమషాలు చేయడం ఏంటని అంతా అనుకుంటున్నారు. విమర్శలు హుందాగా ఉండాలి. నిరసలను ఏవగింపుగా ఉండకూడదు, చొక్కాలు చింపుకుని రోడ్ల మీదకు పడితే జనాలకు అసలే ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతల మీద ఉన్న తక్కువ ఆదరణ కాస్తా ఇంకా మసకబారుతుంది అని అంతా అంటున్నారు.