Begin typing your search above and press return to search.
మంగళగిరిలో లోకేష్ మీద భారీ అస్త్రం
By: Tupaki Desk | 16 April 2023 1:54 PM GMTగుంటూరు జిల్లా మంగళగిరి 2019లో ఏపీ మొత్తాన్ని ఆకట్టుకుంది. దానికి కారణం చంద్రబాబు కుమారుడు, నాటి మంత్రి అయిన నారా లోకేష్ అక్కడ నుంచి పోటీ చేయడమే. లోకేష్ జగన్ వేవ్ లో దారుణంగా ఓడిపోయారు. రెండవసారి వరసగా అక్కడ నుంచి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి గెలిచారు. ఓడిన తరువాత కూడా ఏ మాత్రం నిరుత్సాహం పడకుండా లోకేష్ మంగళగిరిలో తన కార్యకలాపాలను కొనసాగించారు.
తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అదే విధంగా ఎమ్మెల్సీ నిధులను కూడా అక్కడే వెచ్చించారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మంగళగిరిలో గెలిచిన ఆళ్ళ కన్నా ఓడిన లోకేష్ ఎక్కువ శ్రద్ధ చూపించి పనిచేశారనే అంటున్నారు. దాంతో ఈసారి ఆయన గెలుపు ఖాయమని అంతా భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వచ్చిన వ్యతిరేకతతో పాటు అమరావతి రాజధానిని మూడు ముక్కలుగా చేయాలని చూడడం, అభివృద్ధి లేమి వంటి కారణాలు లోకేష్ కి ప్లస్ అయ్యే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయని అంటున్నారు. అయితే లోకేష్ ని మళ్లీ ఓడించాలన్నదే వైసీపీ ఎత్తుగడగా చెబుతున్నారు.
మంగళగిరి నిజానికి టీడీపీకి బాగా వీక్ సీటు. అక్కడ ఆ పార్టీ చివరి సారిగా గెలిచింది 1985లో అంటే ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా టీడీపీ మంగళగిరిలో గెలుపు పిలుపు వినలేదు. అలాంటి చోట లోకేష్ పోటీ చేయడం ఓడడం అంటే అది సంచలనం అయినా గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఇవి. ఇక రెండవసారి కూడా అదే చోటు నుంచి పోటీ చేసి గెలవాలని లోకేష్ చూడడం కాస్తా రిస్క్ తో కూడిన వ్యవహారమే అంటున్నారు.
దానికి కారణం అక్కడ సామాజిక పరిస్థితులు. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం అధికంగా ఉంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల అతి తక్కువ తేడాతో ఓడారు. ఆయన ఇపుడు వైసీపీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ టీడీపీల నుంచి వచ్చిన మురుగు హనుమంతరావు అనే మరో బలమైన చేనేత సామాజికవర్గం నేత కూడా వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేనేత సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతకు వైసీపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. మంగళగిరిలో గెలుపు కోసం ఆమె దన్ను కూడా తీసుకోవాలనుకోవడమే అసలు రీజన్ అంటున్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే, కీలకమైన నాయకులురాలు చేనేత సామాజికవర్గం నేత కాండ్రు కలమ కూడా వైసీపీలో ఉన్నారు. వీరంతా మంగళగిరిలో చక్రం తిప్పేవారే.
అత్యధిక జనాభా ఉన్న చేనేతల నుంచే ఈసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ని నిలబ్వెట్టబోతున్నారు. కచ్చితంగా బీసీ కార్డుతోనే వైసీపీ ముందుకు వస్తుందని అంటున్నారు. ఆ విధంగా లోకేష్ కి చెక్ పెడుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద లోకేష్ ని ఈసారి కూడా ఓడించడం ద్వారా వైసెపీఎ భారీ రాజకీయ లాభాన్నే కోరుకుంటోంది.
చంద్రబాబు తరువాత టీడీపీని లోకేష్ లీడ్ చేస్తారని అంటున్నారు. ఆయననే రెండు సార్లు ఓడించి ఏమీ కాకుండా చూపిస్తే టీడీపీకి ఇక సరైన రాజకీయ నాయకత్వమే లేకుండా పోతుందని ఆ పార్టీ భవిష్యత్తు సైతం ఇబ్బందులలో పడుతుంది అన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్. మరి అలా జరుగుతుందా. చూడాల్సిందే.