Begin typing your search above and press return to search.
పెళ్లి కార్డు ఇస్తున్నా పెళ్లికి రావొద్దు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విచిత్ర ఆహ్వానం !
By: Tupaki Desk | 24 Dec 2020 5:30 AM GMTకరోనా వైరస్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నింటిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కనీసం బయటకి వెళ్తే నీళ్లు తాగడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో పెళ్లిళ్ల పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనితో పరిమిత సంఖ్యలోనే పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. సింపుల్ గా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకి కరోనా రాకముందు బంధువులు, తోటి రాజకీయ నేతలు, ప్రముఖులతో కళకళలాడాల్సిందే.. కానీ కరోనా దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తన కుమార్తె వివాహాన్ని పరిమితంగా నిర్వహిస్తున్నారు. జనవరి 2న తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి ఎవరూ రావొద్దని ఆయన కోరాల్సి వచ్చింది. కరోనా నిబంధనలు కారణమని.. ఆహ్వాన పత్రికతోపాటు అందించిన స్వీట్ బాక్సు వెనుకే ఈ సందేశాన్ని ముద్రించారు. ‘వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి సుమూర్తం నిశ్చయించారని.. శ్రేయాభిలాషులైన అందర్ని ఆహ్వానించి, నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్న విషయం తెలిసిందే అన్నారు. అందుకే పరిస్థితుల్ని గమనించి, సహృదయంతో వారి, వారి ఇళ్ల నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించాలి’అని విచిత్రమైన ఆహ్వానాన్ని అందిస్తున్నారు.
ఈ వివాహ శుభ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో ప్రజలకు స్పెషల్ గిఫ్ట్ అందజేస్తున్నారు. మొత్తం లక్ష స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.