Begin typing your search above and press return to search.
ఏపీలో ఇదేం దరిద్రం.. టీడీపీ నేతల ఫైర్.. గవర్నర్‌ను కలిసిన సీనియర్లు
By: Tupaki Desk | 12 Feb 2023 12:53 AM ISTఏపీలో ఇదేం దరిద్రం.. అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక అధికారిని కలుసుకునేందుకు రాజ్యాంగ పరిరక్షకుడు అయిన గవర్నర్ సిఫారసు చేయాల్సిన దుస్థితి వస్తోందని అంటున్నారు. సాధారణంగా గవర్నర్ వంటి పెద్దలను కలుసుకునేం దుకు ఉన్నతాధికారులు ఎవరికైనా సాయం చేస్తారని చెబుతున్నారు. అలాంటిది ఒక డీజీపీని.. అంటే అధికారిని కలుసుకునేం దుకు.. సమస్యలు చెప్పుకొనేందుకు గవర్నర్ వంటి పెద్దలను జోక్యం చేసుకోవాలని కోరాల్చి వచ్చిందని, ఇలాంటివి ఏపీలోనే చెల్లుతున్నాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. పాదయాత్రను పోలీసులు పదే పదే అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయాలని అనుకున్నారు.
కానీ, ఆయన కంటికి కూడా కనిపించకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల డీజీపీ కార్యాలయానికివెళ్లిన టీడీపీ నేతలతో వివాదం కూడా అయిందని అంటున్నారు.
దీంతో విసిగిపోయిన తాము.. తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు వెళ్లామని, లోకేష్ పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు.
లోకేష్‌కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పటి వరకు డీజీపీని కలిసే అవకాశం రానందున ఆయన్ని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్‌ను తెలుగు దేశం నేతలు కోరారు.
ఈ క్రమంలో తమ ఫిర్యాదుపై తప్పక న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18 సార్లు ఫిర్యాదు చేశామని, వేటిలోనూ తమకు న్యాయం జరగలేదని గవర్నర్‌కు వివరించామన్నారు. నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల ద్వారా లోకేష్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలు గవర్నర్‌కు అందజేశారని తెలిపారు. మరి ఇప్పటికైనా.. గవర్నర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలని టీడీపీ నాయకులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.