Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆక‌స్మిక మృతి!

By:  Tupaki Desk   |   11 May 2019 12:12 PM GMT
టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆక‌స్మిక మృతి!
X
టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే క‌న‌కారెడ్డి ఆక‌స్మిక మృతి ఇప్పుడు ప‌లువురిలో విషాదాన్ని నింపుతోంది. 2008లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. 2014లో టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా మ‌ల్కాజిగిరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసి విజ‌యం సాధించారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి సీటును క‌న‌కారెడ్డికి కేసీఆర్ కేటాయించ‌లేదు. ఈ స్థానాన్ని మైనంప‌ల్లి హ‌నుమంత‌రావుకు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. ఆయ‌న తెర వెన‌క్కి వెళ్లిపోయారు. క‌న‌కారెడ్డికి ద్రాక్ష తోట‌ల పెంప‌కం మీద మంచి ప‌ట్టు ఉంద‌న్న పేరుంది. ఉమ్మ‌డిరాష్ట్రంలో ద్రాక్ష పెంప‌కందారుల సంఘానికి రాష్ట్ర అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మ‌రోవైపు క‌న‌కారెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా సిట్టింగుల‌కు టికెట్లు ద‌క్క‌ని అతి కొద్దిమందిలో క‌న‌కారెడ్డి ఒక‌రు. ఎమ్మెల్యేల మీద వ్య‌తిరేక‌త ఉన్నా.. సెంటిమెంట్ ర‌గిలి కేసీఆర్ హ‌వాతో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు భారీగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టికెట్ ల‌భించ‌ని క‌న‌కారెడ్డి.. తాజాగా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌టం ప‌లువురు విస్మ‌యానికి గురి అవుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని క‌న‌కారెడ్డి క్యాడ‌ర్ జీర్ణించుకోలేక‌పోతున్నారు.