Begin typing your search above and press return to search.
చిరుపాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెప్పులు.. ఆ మాస్ జోష్ లెక్కలే వేరట!
By: Tupaki Desk | 21 Aug 2022 7:30 AM GMT''అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు? ఎర్రటి ఎండలో మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుక మాయామశ్చీంద్ర ఏంది? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటది'' అంటూ మునుగోడులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు.. పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు ఇదే స్పీచ్ లో మరోచోట చెప్పారు. అదేమంటే.. 'నా బలం, ధైర్యం మీరే కదా! మీ బలంతోనే నేను కొడుతున్నా. మరి మీరే నన్ను బలహీనపరిస్తే నేనేం చేయాలి? ' అంటూ ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ వాయిస్ లో కొంత ఆదర్దా కనిపించింది. ఓవైపు బెబ్బులి మాదిరి చెలరేగిపోతూనే.. మళ్లీ సందేహానికి గురై.. కాస్తంత తగ్గి ఓటర్ల దేవుళ్లే తనకు శ్రీరామరక్ష అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇలా ఒకే సందర్భంలో వేర్వేరు కేసీఆర్ లను చూపించిన అధినేతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు.. మంత్రులు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పార్టీ ఫ్యూచర్ కు మునుగోడు ఎంతటి కీలకమన్న విషయాన్ని తెలిసిన వారు.. నిన్నటి బహిరంగ సభకు పెద్ద సారు ఇచ్చిన టార్గెట్ కు ఏ మాత్రం తగ్గకుండా 100 నుంచి 150కార్లతో వారికి కేటాయించిన ప్లేస్ కు వెళ్లి.. సీఎం వారి కాన్వాయ్ తో పాటు వెళ్లటం చూశాం. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు వ్యవహరించిన తీరు ఆసక్తికరంగానే కాదు.. వారి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బహిరంగ సభల్లోనే కాదు.. పార్టీ కార్యక్రమాల్లో కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న చేష్టలు చర్చనీయాంశంగా మారాయి.
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా ఆ కోవలోకే వస్తారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలోని ''మాయ.. ఓ మాయ..'' పాటకు తీన్మార్ స్టెప్పులు వేసి.. చుట్టూ ఉన్న వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. తాజాగా కరీంనగర్ లోజరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రవిశంకర్ తన ఊపును.. ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చిరు సినిమా పాటకు తాను కాలు కదిపి.. డ్యాన్సు వేశారు. చుట్టూ ఉన్న వారిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆయన డ్యాన్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలోఆయన మాంచి జోష్ తో డ్యాన్సు వేసి అందరిని ఉత్సాహపరిచారు. వాస్తవానికి.. పార్టీ నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన చెలరేగిపోయారు. అంతా బాగుందని.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను తన చుట్టూ ఉండే వారిలో నింపే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. కానీ..వాస్తవం అందుకు వేరుగా ఉందంటున్నారు. ఇటీవల పీకే నిర్వహించిన సర్వే రిపోర్టు అంత బాగా వచ్చింది లేదని.. ఇలాంటి వేళలో.. తనకు ప్రజల్లో మంచి పట్టు ఉందనే భావన లోకానికి తెలియజేసే ప్రయత్నంలోనే తాజా వీడియో షూట్ చేసి.. వైరల్ అయ్యేలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అని ఊరికే అనలేదుగా?