Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ .. ఎవరు చేసారంటే ?

By:  Tupaki Desk   |   22 Aug 2020 9:30 AM GMT
సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ .. ఎవరు చేసారంటే ?
X
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేసే అటెండర్లు, వాలంటీర్లు, అక్కడ పై అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, వసూళ్లకు పాల్పడే ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఇప్పుడు ఓ ఘనుడు ఏకంగా సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఆ ఘనుడు టీఆర్ ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూనే..సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేయడం గమనార్హం.

పూర్తి వివరాలు చూస్తే .. కరీంనగర్ జిల్లాకు చెందిన చింటు అనే యువకుడు టీఆర్ ఎస్ లో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. వాట్సప్ స్టేటస్ డీపీ, ఫేస్ బుక్ లో కేసీఆర్, కేటీఆర్ లతో దిగిన ఫొటోలు, తెలంగాణ స్టేట్- ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిటీ ఛైర్మన్, ,కరీంనగర్ జిల్లా టిఆర్ ఎస్ యువజన కార్యదర్శి అంటూ పరిచయాలు పెంచుకుని చాలా మంది వద్ద ఆ పని చేసి పెడతా, ఈ పని చేసి పెడతా అని డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మొదట ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల్ని మాయమాటలు చెప్పి నెమ్మదిగా ముగ్గులోకి దింపాడు. సీఎం లెటర్ హెడ్‌ ఫోర్జరీ సంతకంతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడట.

మంత్రి కేటీఆర్ నాకు చాలా క్లోజ్ ఏం కావాలన్న పనులు చేస్తారంటూ చింటు జనాన్ని నమ్మించాడట. అయితే , అతని నిజస్వరూపం బయటపడటంతో సంతకం ఫోర్జరీ కేసులో చింటును అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. చింటూ ఇదివరకే నకిలీ ఉత్తర్వులు తయారు చేశాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అతనిపై చీటింగ్‌ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.