Begin typing your search above and press return to search.
ఆదివాసీలపై కేసులు ఎత్తేస్తాం.. కేసీఆర్ హామీల వర్షంలో తడిసి ముద్ద!!
By: Tupaki Desk | 30 Jun 2023 8:14 PMతెలంగాణ ముఖ్యమంత్రి తలుచుకుంటే చాలు.. ఏదైనా చేస్తారనే టాక్ ఉంది. ఆయన చేయాలని అనుకుంటే.. మరుక్షణం.. అయి పోతుంది. పైగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సీజన్ కావడంతో కేసీఆర్ వర్గాలను.. ఎంచుకుని వడివడిగా పథకాలను అమలు చేస్తున్నారు. ఇటీవలే.. బీసీలకు రూ.లక్ష ప్రకటించి.. వెంటనే అమలు చేశారు. దీనికి ముందు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరించారు. ఇక, ఉద్యోగులపైనా వరాలు కురిపించారు. వెంటవెంటనే నిరుద్యోగులకు నియామకాలు చేపట్టారు. ఇలా.. కేసీఆర్ ఎన్నికల ముంగిట అన్ని వర్గాలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ పరంపరలో ఆదివాసీలను కూడా తనవైపు తిప్పుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎప్పటి నుంచొ వివాదంగా ఉన్న.. ఎన్నో ప్రభుత్వాలుసైతం చేసేందుకు ముందుకు వచ్చి కూడా చేయని. పోడు భూములకు పట్టాలు ఇచ్చేశారు. ఇది గొప్ప సంచలన నిర్ణయమేనని బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో కేసీఆర్.. కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీలపై పెండింగులో ఉన్న కేసులను కూడా ఎత్తేస్తామని చెప్పారు. అలాగే.. మరిన్ని హామీల వర్షంలో ఆదివాసీలు తడిసి ముద్దయ్యేలా చేశారు. తాజాగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో పర్యటించిన కేసీఆర్.. వరాల జల్లు కురిపించారు.
కేసీఆర్ హామీల వరద..
+ కొమురం భీం జిల్లాలోని 45 వేల ఎకరాల పోడు భూములకు రెండు, మూడు రోజుల్లో పట్టాలు ఇస్తాం.
+ ఆదివాసీలకు రైతు బంధు పడేలా కూడా చర్యలు తీసుకుంటున్నాం.
+ ఆదివాసీ గ్రామాలకు రాబోయే రెండు, మూడు నెలల్లో త్రీఫేస్ విద్యుత్
+ పోడు భూముల వివాదంలో ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నాం.
+ కౌటాల నుంచి వార్ధ నది మీదుగా మహారాష్ట్రకు వెళ్లేందుకు వంతెన నిర్మిస్తాం.
+ కాగజ్‌నగర్‌కు ఐటీఐని కూడా మంజూరు చేస్తున్నాం.
+ నాగమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తాం