Begin typing your search above and press return to search.
విజయకుమార్ స్వామి వచ్చిన ప్రత్యేక ప్లైట్ రామోజీ వియ్యంకుడిది.. వైవీ షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 19 April 2023 9:25 AMరెండు రోజులుగా తెలుగు మీడియాలో ఒక ఆసక్తికర కథనం పెను సంచలనంగా మారటమే కాదు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చను రేకెత్తించింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన ఆదివారం.. మైసూర్ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో స్వామిజీ కమ్ లాబీయిస్టుగా పేరున్న విజయ్ కుమార్ ను ప్రత్యేక విమానంలో గన్నవరానికి తీసుకొచ్చారని.. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్లుగా వార్తలు అచ్చు అయ్యాయి.
ఈ సందర్భంగా లాబీయిస్టు విజయ్ కుమార్ స్వామిజీని తీసుకొచ్చిన వైనంపై వస్తున్న విమర్శల వేళ.. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారన్న మండిపాటు వ్యక్తం చేసిన ఆయన.. మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను కలిపేందుకు విజయ్ కుమార్ స్వామిని తీసుకొచ్చానని.. దానికే ఏదేదో రాసేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మైసూర్ నుంచి స్వామిజీని హైదరాబాద్ కు తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఎవరిదో చెప్పాలన్నారు. మరి.. ఆ ప్రత్యేక ఫ్లైట్ రామోజీరావు వియ్యంకుడు నవయుగ విశ్వేశ్వరరావుదే కదా? స్వామీజీతో పాటు విశ్వేశ్వరరావు కొడుకు శశిధర్ కూడా ఉన్నారు కదా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక విమానంలో వచ్చారు నిజమే.. మరి ఆ విమానం ఎవరిది? అసలు విజయ్ కుమార్ స్వామి ఎవరి ద్వారా విజయవాడకు వచ్చారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సవాలు విసిరారు.
రామోజీ రావు బంధువు విమానంలో విజయ్ కుమార్ స్వామి ఎందుకు వచ్చారన్నది తమకు తెలీదన్న సుబ్బారెడ్డి.. ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందజేయటాన్ని తీసుకెళితే.. దానికి లాబీయింగ్ అని పిలుస్తారా? అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల్లోని కొన్నింటిని చూస్తే..
- ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందజేయడానికి వస్తే.. లాబీయింగ్ అని పేరు పెడతారా?
- అసలు మీరు, విజయకుమార్ స్వామిని విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు?
- రామోజీ బంధువులు 2017-18లో హైదరాబాద్ లో గ్రహప్రవేశంలోనూ విజయకుమార్ స్వామి హాజరయ్యారు కదా?
- చాలామంది స్వామీజీలతో పరిచయం ఉంది. విజయకుమార్ స్వామి అంటే ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన మంచి భక్తుపరులు. సీఎంకు ఆయన ఆశీస్సులు ఉంటే.. రాష్ట్రానికి.. ప్రజలకు మేలు చేసినట్లు అవుతుంది కదా అని సీఎంకు కలిపించటం జరిగింది.
- ఇప్పటికే ఎంతోమంది స్వామీజీలను తీసుకొచ్చాను. విజయకుమార్ స్వామిజీ విజయవాడకు వస్తున్నారని తెలిసి.. ఆయన్ను ప్రత్యేకంగా నేను అడిగాను. సీఎం జగన్ కు ఆశీస్సులు ఇప్పించేందుకు తీసుకెళ్లా.
- ఆ రోజు నేను విజయవాడలో లేను. అయినా నేను రిక్వెస్టు చేయటంతో ఆయన ఒప్పుకున్నారు. అందుకే నేను బెజవాడలో లేకున్నా.. అన్నీ ఏర్పాట్లు చేయటంతో స్వామివారు వచ్చి సీఎంకు ఆశీస్సులు అందజేసి వెళ్లారు.
- స్వామీజీలపై వారికి నమ్మకం ఉందో లేదో తెలీదు. మాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. మేం స్వామీజీల ఆశీస్సుల్ని తీసుకుంటాం.
- మేమేదో లాబీయింగ్ చేయటానికి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. మరి రామోజీ లాంటోళ్లు ఏ ప్రయోజనం కోసం ఆయన్ను రప్పించుకున్నారు?
- మా వద్దకు వస్తే లాబీయిస్టు అని రాశారు. కానీ.. వారి వద్దకు ఎందుకు వచ్చినట్లు? విజయకుమార్ స్వామిని ఎవరు తీసుకొచ్చారు? ఆయన చాలా సింఫుల్ గా ఉండే వ్యక్తి. ఆయన్ను మేం దైవాంశ సంభూతుడిగా కొలుస్తాం.