Begin typing your search above and press return to search.
అసలు టీటీడీ డిక్లరేషన్ లో ఏముంటుంది?
By: Tupaki Desk | 22 Sep 2020 5:35 PM GMTటీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా అన్యాపదేశంగా అన్యమతస్థులకు డిక్లరేషన్ పై ఏదో మాట్లాడితే అది మీడియాకు ఏలానో అర్థమై వివాదం అయ్యింది. తాజాగా దాన్ని వైవీ సుబ్బారెడ్డి కరెక్ట్ చేసుకున్నారు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని.. అయితే నాటి సీఎం వైఎస్ఆర్, సోనియాలు ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. దాన్ని వివాదం చేయవద్దని మీడియాకు విన్నవించారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అన్ని మతాల నుంచి వేలాది మంది ప్రతిరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే హిందువులు కాని వారిని డిక్లరేషన్ అడుగుతారు. హైందవ సంప్రదాయాలు కాపాడడం కోసం ఇలా చేస్తారు.
బ్రిటీష్ హయాం నుంచి అన్య మతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఫారాం మీద సంతకాలు చేసే సంప్రదాయం ఉండేది. 1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించేవారు.ఇతర మతస్థులు వస్తే వారి నుంచి డిక్లరేషన్ తీసుకునేవారు.
1990 ఏప్రిల్ 11న అనంతరం అప్పటి ఏపీ ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర మతస్థులు టీటీడీ ఆలయాలకు వస్తే ఆహ్వానిస్తారు.కానీ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం ఉందని.. గౌరవం ఉందని.. దర్శనానికి అనుమతించాలని ఆ డిక్లరేషన్ లో సంతకం చేసి దర్శించుకోవాలి.