Begin typing your search above and press return to search.
ట్విటర్ కు తాలిబన్ల అభినందనలు.. కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 11 July 2023 5:22 PM GMTప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ యాప్స్ లో ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ అనే వార్ నడుస్తుందనే కామెంట్లు గతకొన్ని రోజులుగా తెర పైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయం లో థ్రెడ్స్ పై లీగల్ యాక్షన్ కు సైతం ట్విట్టర్ ప్రొసీడ్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఈ సమయం లో ట్విట్టర్ కు అనుకోని వర్గం నుంచి అభినందనలు వచ్చాయి!
ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ గా ఆన్ లైన్ లో వార్ నడుస్తుందని కామెంట్లు వస్తున్న తరుణం లో ఆ సంస్థకు ఊహించని వర్గం నుంచి ప్రశంసలు లభించాయి. అది మరేవరో కాదు... తాలిబన్లు! అవును... అఫ్గానిస్థాన్ ను పాలిస్తున్న తాలిబన్లు ట్విటర్ ను తెగ పొగిడేశారు. ట్వీటర్ కు మరేదీ సాటి రాదన్న రేంజ్ లో పొగడ్తలతో ముంచెత్తారని తెలుస్తుంది.
వాక్ స్వేచ్ఛ, విశ్వసనీయత విషయం లో ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విటర్ ముందుందని తాలిబన్లు ప్రశంసించార ని అంటున్నారు. ఈ విషయాన్ని తాలిబన్ల లోనే అత్యంత క్రూరమైన వర్గంగా పేరున్న హక్కానీ నెట్ వర్క్ అధినేత అనస్ హక్కానీ పేర్కొన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని అనస్ హక్కానీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
"ఇతర సోషల్ మీడియా వేదికల తో పోలిస్తే ట్విటర్ రెండు అంశాల్లో ముందుంది. వీటిల్లో మొదటిది వాక్ స్వేచ్ఛ. రెండో అంశం పారదర్శకత.. విశ్వసనీయత. ట్విటర్ ను మరో వేదిక భర్తీ చేయలేదు" అని అనస్ హక్కానీ ట్వీట్ చేశారు. దీంతో... తాలిబన్లు వాక్ సేచ్ఛ, విశ్వసనీయతల గురించి మాట్లాడటం అంటే... దెయ్యలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
కాగా.. ట్విటర్ కు పోటీగా మెటా "థ్రెడ్స్" యాప్ ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని లో దాదాపుగా ట్విటర్ వంటి ఫీచర్లే ఉన్నాయని కామెంట్లు వస్తున్న తరుణం లో... తమ మేధో హక్కుల ను వాడుకొని ఈ యాప్ చేశారని మస్క్ నుంచి విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సుమారు వారం రోజుల వ్యవధి లోనే థ్రెడ్స్ 10 కోట్ల లాగిన్లను సొంతం చేసుకొందని తెలుస్తుంది!
కాగా... తాలిబన్ల ను ఫేస్ బుక్ నుంచి బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క భారీ సంఖ్యలో తాలిబన్ నాయకులు, అధికారులు, మద్దతుదారులు ట్విట్టర్ లో కొత్తగా వచ్చిన బ్లూటిక్ ల సబ్ స్క్రిప్షన్ లను తీసుకొన్నారు!