Begin typing your search above and press return to search.
బీజేపీలోకి నమిత...అన్నాడీఎంకేకు గుడ్ బై!
By: Tupaki Desk | 30 Nov 2019 2:49 PM GMTదక్షిణాదిలో పార్టీని ఎలాగైనా బలోపేతం చేసే దిశగా కమలనాథులు చేస్తున్న యత్నాలు ఒక్కొక్కటిగానే సఫలం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీలోకి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు చేరిపోతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇలాంటి చేరికల్లో దక్షిణాదిలో బీజేపీకి కొరుకుడు పడని తమిళనాట ఇద్దరు కీలక నటులు ఆ పార్టీలో చేరిపోయారు. ప్రముఖ నటి నమితతో పాటు సీనియర్ నటుడు రాధారవి కూడా శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దా సమక్షంలో శనివారం చెన్నైలో వీరిద్దరూ బీజేపీలో చేరిపోయారు.
నమిత విషయానికి వస్తే... ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్ గా చెలామణి అయిన నమితకు ఇప్పుడు అంత పెద్దగా సినీ అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో అన్నాడీఎంకే అదినేత్రి జయలలిత బతికుండానే... ఆ పార్టీలో చేరిపోయిన నమిత... జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. ఇదే క్రమంలో తమిళ నాట తమ సత్తా చాటేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్న కమలనాథులు... పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారు ఎంత చిన్న నేతలైనా కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఈ క్రమంలోనే నమిత బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపగానే... ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే సమయంలో రాధారవి కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరచడంతో ఆయనకూ పార్టీ కండువా కప్పేశారు.
ఈ ఇద్దరు నటుల చేరికతో బీజేపీకి తమిళ నాట అంత పెద్దగా జనాదరణ వస్తుందని చెప్పలేం గానీ.. ఓ మోస్తరు ఓట్లను అయితే సాధించగలదన్న వాదన వినిపిస్తోంది. హీరోయిన్ గా తనదైన సత్తా చాటిన కాలంలో నమితకు తమిళనాట భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన తార అయిన నమితకు తమిళ తంబీలు ఏకంగా గుడి కూడా కట్టించేసిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీలో నమిత చేరికతో ఆమె అభిమానుల్లో కొందరైనా ఓట్లు వేస్తారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.