Begin typing your search above and press return to search.

'గే' అని చెప్పుకొని పరిచయం చేసుకొని పైలెట్ చావుకు కారణమయ్యాడు

By:  Tupaki Desk   |   4 Jun 2023 8:00 PM GMT
గే అని చెప్పుకొని పరిచయం చేసుకొని పైలెట్ చావుకు కారణమయ్యాడు
X
గ్లామర్ ప్రపంచంలో ప్రేమించుకోవటాలు.. పెళ్లి చేసుకోవటాలు.. విడిపోవటాలు చాలా సహజంగా జరుగుతుంటాయి. అయితే.. ఇటీవల కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే విడిపోతున్న నటీనటులు.. తమ మాజీ భాగస్వాముల మీద చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే తమిళ టీవీ నటి దివ్య శ్రీధర్ తన మాజీ భర్త అర్ణవ్ పై చేశారు.

తమిళ టీవీ నటుడిగా సుపరిచితుడైన అర్ణవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సహ నటి దివ్య.. నిండు గర్భిణిగా ఉన్న వేళలో వారు విడిపోవటం తెలిసిందే. ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చిన దివ్య తాజాగా తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అర్ణవ్ ఒక పైలెట్ చావుకు కారణమని పేర్కొంది. తనను తాను 'గే'గా పరిచయం చేసుకున్న అర్ణవ్.. ఒక పైలెట్ నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశాడని చెప్పింది. అతని చావుకు కారణమయ్యాడంటూ భారీ బాంబ్ ను పేల్చింది.

అంతేకాదు తన మాజీ భర్త.. గతంలో అనేకమందిని పెళ్లి చేసుకొని మోసం చేశాడన్న ఆమె.. తాను ఉత్తగా ఆరోపణలు చేయటం లేదన్నట్లుగా పలు ఆడియో క్లిప్ లను..పలువురు అమ్మాయిలతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను జత చేయటం సంచలనంగా మారింది. తాజాగా దివ్య విడుదల చేసిన ఆడియో క్లిప్ లో ఒక ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ.. ఆర్ణవ్ ను తాను పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నానని.. కొన్నేళ్ల వరకు హ్యాపీగా ఉన్నట్లుగా పేర్కొంది. మరో మహిళతో పరిచయమయ్యాక తనను వేధించాడని.. ఎనిమిదేళ్లు అతడి వేధింపుల్ని భరించినట్లుగా సదరు ఆడియో క్లిప్ లో ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే అర్ణవ్ ఆరోపణలు వేరుగా ఉన్నాయి. తనను పెళ్లాడటానికి ముందే దివ్యకు పెళ్లై.. ఒక కుమార్తె ఉందన్న విషయాన్ని దాచి పెట్టిందన్న ఆరోపణలు చేశారు. అయితే.. దీనికి కౌంటర్ గా దివ్య మాత్రం.. అర్ణవ్ కు తాజాగా మరో సీరియల్ నటి అన్షితతో ఎఫైర్ ఉందని ఆరోపణ చేసింది. మొత్తానికి వీరిద్దరి ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వ్యవహారం అంతకంతకూ రచ్చగా మారుతున్న పరిస్థితి.