Begin typing your search above and press return to search.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారు సీజ్
By: Tupaki Desk | 1 May 2020 4:00 AM GMTచట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న మాటకు తగ్గట్లే ఏపీ పోలీసులు తూచా తప్పనట్లుగా వ్యవహరించారు. తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే.. అంతా సమానమే అన్నట్లు చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఏపీ పోలీసులు. వైరస్ వ్యాప్తి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారు ఎవరైనా సరే.. వారి మీద చర్యలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
తణుకు ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును పోలీసులు సీజ్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. క్రిష్ణా జిల్లా కైకలూరు ఆడిషనల్ ఎస్పీ సత్తిబాబు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూల్స్ బ్రేక్ చేస్తూ తిరుగుతున్న కార్లను గుర్తించారు. ఇందులో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు చెందిన ఏపీ 39 సీఎల్0126 ఫార్చునర్ కారు కూడా ఉంది.
తణుకు చెందిన కారు ఎలాంటి అనుమతులు లేకుండా క్రిష్ణా జిల్లాలో ప్రవేశించిన వైనంపై ఆ కారును సీజ్ చేస్తూ అడిషనల్ ఎస్పీ సీజ్ చేశారు. అధికారపక్ష ఎమ్మెల్యే కారు అన్నది చూడకుండా సీజ్ చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పోలీసు ఉన్నతాధికారి తనిఖీలు నిర్వహిస్తున్న వేళ.. కారులో అధికారపక్ష ఎమ్మెల్యే ఉన్నారా? లేరా? అన్న విషయం పై మాత్రం క్లారిటీ రావట్లేదు. మొత్తంగా ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే కారును సైతం రూల్స్ ను బ్రేక్ చేసిన కారణంతో సీజ్ చేయటం ఆసక్తికరంగా మారింది.