Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అరుదైన వజ్రం మన దగ్గర గుర్తింపు
By: Tupaki Desk | 16 April 2023 5:00 AM GMTవజ్రాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బంగారం కంటే విలువైనవి వజ్రాలు. ఇవి సహజంగా మెరుస్తాయి. దీంతో వజ్రాలు దరించిన నగలు చూస్తే మనకు ఎంతో ఉల్లాసం కలుగుతుంది. ఇప్పుడే అది స్టేటస్ సింబల్. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఓ అరుదైన వజ్రాన్ని కనుగొన్నారు. దాని పేరు బీటింగ్ హార్ట్. ఇక్కడి వజ్రాల వ్యాపారి దీన్ని గుర్తించారు. ఇది 0.329 క్యారెట్ల బరువుంది. 2022 అక్టోబర్ లో వీడీ గ్లోబల్ సంస్థ దీన్ని తొలిసారి కనుగొన్నది.
దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో రెండు వజ్రాలున్నాయట. లోపల ఇంకో వజ్రం అటు ఇటు కదులుతుందని కనుగొన్నారు. దీంతో ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అనే పేరు పెట్టామని వీడీ గ్లోబల్ సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఈ వజ్రం ఎన్నో అరుదైన ప్రత్యేకతలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు ఇలాంటి వజ్రాన్ని చూడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సూరత్, ముంబై కేంద్రంగా వజ్రాల వ్యాపారం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. వీడీ గ్లోబల్ సంస్థ వజ్రాల వ్యాపారంలో రాటుదేలింది. ఈ సంస్థ బీటింగ్ హార్ట్ వజ్రాన్ని లండన్ పంపించారు. పరీక్షలు చేయించారు. అక్కడి వారు సైతం దీన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ఇలాంటి వజ్రాన్ని తాము ఎన్నడు చూడలేదని ప్రకటించారు. ఇంతటి అరుదైన వజ్రం చాలా కాలం తరువాత చూస్తున్నామన్నారు. గత ముప్పై ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని చెబుతున్నారు.
దీంతో ఈ వజ్రం విశిష్టత గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇది అరుదైనది కావడంతో దీనికి ధర కూడా ఎక్కువగానే పలుకుతుంది. దీన్ని ఎవరు కొనుగోలు చేస్తారో వారికి అన్నింట్లో మంచి శుభాలు కలుగుతాయని సూచిస్తున్నారు. వజ్రం లోపల వజ్రం ఉన్న దాన్ని గతంలో సైబీరియాలో గుర్తించారు. ఇప్పుడు మన సూరత్ లో దొరకడం గమనార్హం.
అప్పుడు దొరికిన వజ్రానికి మత్ర్యోష్క అనే పేరు పెట్టారు. ఇది 0.62 క్యారెట్ల బరువు ఉంది. 2021లో ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి వజ్రాన్ని కనుగొన్నారు. దీని బరువు 0.844 క్యారెట్లు. ఇలా అరుదైన వజ్రాలు లభిస్తూనే ఉంటాయి. వాటి గురించి చెప్పుకోవడం సహజం. కొంత కాలానికి మళ్లీ ఓ వజ్రం దొరుకుతుంది. ఇలా వజ్రాల వేటలో ఉన్న వారికి అరుదైన డైమండ్లు లభించడం కొత్తేమీ కాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.