Begin typing your search above and press return to search.

బీజేపీ తరుఫున రంగంలోకి ఈ సినీ ప్రముఖులు

By:  Tupaki Desk   |   24 Nov 2020 3:00 AM GMT
బీజేపీ తరుఫున రంగంలోకి ఈ సినీ ప్రముఖులు
X
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడిలో అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతోంది. ఇక ఎన్నడూ లేనిది తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదీలను.. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆవహించి ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను ఆకట్టుకోవడానికి వరాల మూట విప్పారు.అయితే ఆయన ఎన్నికల వేళ మాత్రమే విప్పడంపై పలువురు సినీ ప్రముఖులు లోలోపల ఆగ్రహంతో ఉన్నారు. సినీ పెద్దలతో సమావేశమై కేసీఆర్ కూల్ చేసినా.. తాజాగా పలువురు బీజేపీ తరుఫున వకాల్తా పుచ్చుకొని కాస్త గట్టిగానే విమర్శలు సంధించారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్ సినీ ప్రముఖుల మధ్య చిచ్చుపెట్టింది. గ్రేటర్ పోరులో టీఆర్ఎస్ వైపు పోసాని కృష్ణ‌ముర‌ళి, ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ లు నిలిచారు. వీరిద్దరూ ప్రెస్ క్ల‌బ్ లో ప్రెస్ మీట్ పెట్టి.. త‌మ వాద‌న వినిపించారు. బీజేపీ వైపు రంగంలోకి దిగారు సీనియ‌ర్ న‌టి క‌విత‌, మ‌రో న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు. వీరు బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ టీఆర్ఎస్ త‌ర‌ఫున వాణి వినిపించిన ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. పోసాని జెన్యూన్ గా మాట్లాడడంతో ఆయనను వదిలేశారు. దర్శకుడు ఎన్ శంకర్ కేసీఆర్ సర్కార్ నుంచి భూములు తీసుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

గ‌తంలో క‌విత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ప‌ని చేశారు.. రోశ‌య్య సీఎంగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ వైపు మాట్లాడారు, కొంత‌కాలం టీడీపీలో పనిచేశారు కూడా. ఇప్పుడు ఈమె బీజేపీ తరుఫున మాట్లాడడం విశేషం. ఇక మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ న‌ర‌సింహారావు గ‌తంలో లోక్ స‌త్తా త‌ర‌ఫున టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌ట్టున్నారు. అప్ప‌ ట్లో చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు టీవీ కార్య‌క్ర‌మాల్లో విమ‌ర్శ‌లు చేశారు సీవీఎల్. ఈయ‌న ఇప్పుడు బీజేపీ త‌ర‌ఫున స్పందించారు.

తెలంగాణ సినిమాను టీఆర్ఎస్ చంపేసింద‌న్న‌ట్టుగా విమ‌ర్శించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ హిందువుల తరుఫున ఉంటామ‌న్నందుకు టీఆర్ఎస్ ర‌చ్చ చేస్తోంద‌ని సీవీఎల్ విమ‌ర్శించారు. హిందువుల‌ను చంపేస్తాం, ఆవుల‌ను చంపేస్తామంటూ కొందరు మాట్లాడిన‌ప్పుడు ఎవ‌రికీ అభ్యంత‌రం లేక‌పోయిందా? అంటూ సీవీఎల్ ఎంఐఎం-టీఆర్ఎస్ దోస్తీపై పరోక్షంగా ప్ర‌శ్నించారు.

చిరంజీవి, నాగార్జున, అగ్ర నిర్మాతలు అంతా కేసీఆర్ తో సాన్నిహిత్యంగా ఉంటుండగా.. బ్రి గ్రేడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పుడు బీజేపీ తరుఫున మోహరించడంతో జీహెచ్ఎంసీ పోరు రసవత్తరంగా మారింది.