Begin typing your search above and press return to search.
రూపము మారెను..స్టయిలు మారెను.. సరి కొత్త విమానం సందడి!
By: Tupaki Desk | 8 Sep 2020 12:10 PM GMTసరి కొత్త రూపం..భిన్నమైన సీటింగ్... అత్యంత మైలేజీ ఇచ్చే విమానం తొందర్లో అడుగు పెట్టనుంది. 1903 సంవత్సరానికి ముందు రవాణా వ్యవస్థ అంతగా లేదు. గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు ప్రయాణ సాధనాలుగా ఎన్నో ఏళ్లు గడిచాయి. క్రమేణా సైకిళ్లు, రిక్షాలు, బస్సులు, జీపులు, కార్లు వచ్చాయి. 1903లో అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ ఏకంగా గాలిలో ఎగిరే విమానాలను కనిపెట్టారు. 1904, 1905 సంవత్సరాల్లో విమానాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఆ తర్వాత బోలెడన్ని రకాల విమానాలు, హెలికాప్టర్లు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విమాన రంగంలో పలు మార్పులొచ్చాయి. ఇప్పుడు మరో సరికొత్త విమానం ప్రపంచానికి పరిచయం అవుతోంది.
నెదర్లాండ్ శాస్త్రవేత్తలు జర్మనీలో వీ ఆకారంలో ఉన్న విమానాన్ని తయారు చేశారు. దీని ఆకారమే వింతనుకుంటే దీని సీటింగ్ మరింత ప్రత్యేకం. దీనికి రెక్కల్లో సీట్లను అమర్చారు. ఇంధనం, ఇంజిన్ కూడా రెక్కల్లోనే. ఈ కొత్త రకం విమానం తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఇతర విమానాలతో పోలిస్తే 20 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ప్రస్తుతం ఈ విమానం ప్రయోగ దశలోనే ఉంది. దీనిని తొందర్లోనే ప్రపంచానికి పరిచయం చేస్తామని డెప్ట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. బహుశా మైలేజీ దృష్టిలో పెట్టుకుని సిద్ధం అవుతున్న విమానం ఇటీవలి కాలంలో ఇదేనని చెబుతున్నారు. ఈ ప్రత్యేక విమానం విపణిలోకి ఎప్పుడొస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.