Begin typing your search above and press return to search.
50 లక్షల మంది తెలుగు ముస్లింలు చేసిన ప్రతిజ్ఞ సారాంశం ఇదే
By: Tupaki Desk | 25 Jan 2020 4:20 AM GMTకేంద్రం లోని మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం తో పాటు మరో రెండింటిని ముస్లింలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం తమకు ఇచ్చిన స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోమంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు ఇప్పుడు ఒక్క తాటి మీదకు వస్తున్నారు. ఎన్పీఆర్.. ఎన్నార్సీ సర్వేలకు తాము సహకరించమని.. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు నింపమని.. డాక్యుమెంట్లు చూపించమంటూ ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు.
ఈ ప్రతిజ్ఞకు వేదికలు గా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు నిలవటం విశేషం. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ప్రతిజ్ఞల పరంపరనుకొనసాగించటం విశేషం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారత ఆత్మను చంపేందుకే సీఏఏ.. ఎన్నార్సీ.. ఎన్పీఆర్ ను తెర మీదకు తీసుకొచ్చారని వారు చెబుతున్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల్లో యాభై లక్షల మంది మైనార్టీలు ఈ ప్రత్యేక ప్రతిజ్ఞ ను చేసినట్లు గా చెబుతున్నారు.
తాము భారతీయులమని.. తమ పౌరసత్వానికి సంబంధించిన రుజువులు మతతత్వ సర్కారు అడగ లేదని చెబుతున్నారు. విభిన్న మతాలు.. సంస్కృతుల సమ్మేళనం భారత్ గొప్ప తనంగా అభివర్ణిస్తున్న వారు.. ఇదే విషయాన్ని రాజ్యాంగం స్పష్టం చేస్తుందంటూ ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ తరహా నిరసన కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన జేఏసీలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. మతాల్ని విభజించే రాజకీయాల్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ప్రత్యేక ప్రతిజ్ఞ సంచలనం గా మారింది. మరీ విషయం లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.