Begin typing your search above and press return to search.

క్రికెట్ చరిత్రలోనే ఈ క్రికెటర్ ప్రపంచ రికార్డ్

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:30 PM GMT
క్రికెట్ చరిత్రలోనే ఈ క్రికెటర్ ప్రపంచ రికార్డ్
X
ప్రపంచ క్రికెట్ లోనే ఇదో అరుదైన రికార్డుగా నిలిచింది. ఓ క్రికెటర్ ఎవ్వరూ సాధించని ఫీట్ ను సాధించి ఔరా అనిపించాడు. టీ ట్వంటీలకు క్రిస్ గేల్ ఉంటాడు. కానీ అతడు టెస్టులు ఆడడు. మన మహేంద్ర సింగ్ ధోని కూడా టీట్వంటీ వన్డేలే ఆడుతాడు. టెస్టులకు రిటైర్ ఇచ్చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి అరుదైన దిగ్గజ బ్యాట్స్ మెన్ మాత్రమే మూడు ఫార్మాట్లు వన్డే, టెస్ట్, టీట్వంటీలు ఆడుతారు.

ఆ కోవలో న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ కూడా మూడు ఫార్మట్లలోనూ ఇరగదీస్తుంటాడు. మొన్ననే భారత జట్టుపైన వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

తాజాగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు తో న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ టేలర్ కు 100వ టెస్ట్ మ్యాచ్. ఇప్పటికే టీట్వంటీల్లో 100 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అయితే ఇప్పటికే 231 మ్యాచ్ లు ఆడాడు. ఇలా మూడు ఫార్మట్లలోనూ వంద మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ గా రాస్ టేలర్ కొత్త రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్ తరుఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా టేలర్ కావడం గమనార్హం.

2006లో న్యూజిలాండ్ తరుఫున ఆరంగేట్రం చేసిన టేలర్ ఇప్పటివరకూ 100 టెస్టులు, 100 టీట్వంటీలు, 231 వన్డేలు ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడుతానని తెలిపాడు. ప్రస్తుతం ఇతడి వయసు 35 ఏళ్లు. 40 ఏళ్ల వరకూ ఆడుతానని ప్రకటించాడు.