Begin typing your search above and press return to search.

టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు .. ముగ్గురు అరెస్ట్ !

By:  Tupaki Desk   |   7 July 2020 10:30 AM GMT
టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు .. ముగ్గురు అరెస్ట్ !
X
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన లావణ్య, వెంకటేశ్వరరావు అనే పైలట్ ను కులాంతర వివాహం చేసుకుని శంషాబాద్‌ లో కొన్నేళ్లుగా కాపురం ఉంటున్నారు. అయితే పెళ్లయి ఇన్నాళ్లైనా పిల్లలు పుట్టడం లేదంటూ భర్త, అత్తమామలు తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, దీంతో పాటు తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ లావణ్య కొద్దిరోజుల క్రితం ఓ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలింది.

ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా లావణ్య భర్తను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదవరిమడుగు గ్రామానికి చెందిన ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే సమయంలో మరిన్ని సంచలన విషయాలు తెలుసుకున్నారు. భర్త పైలెట్ వెంకటేష్ అకృత్యాలతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పైలెట్ వెంకటేష్ ఆఫీస్ పని పేరుతో ప్రియురాలితో కలిసి విదేశాలలో తిరిగేవాడని వెల్లడైంది. ఫ్లైట్ టికెట్‌లు, వాట్సాప్ చాటింగ్, లైవ్ చాటింగ్‌లో లహరి వెంకటేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఆ అక్రమ సంబంధం గురించి నిలదీసింది. గుట్టు తెలిసిపోవడంతో ఇక భార్య ముందే లైవ్‌లో ఆ యువతితో సరస సంభాషణలు మొదలు పెట్టాడు. ఇవన్నీ చూసి లావణ్య తట్టుకోలేకపోయింది. అలాగే ఆ యువతికి ఫోన్ చేసి తనకు అన్యాయం చేయొద్దని వేడుకుంది. అయితే , ఆ యువతీ వెంకటేష్ ‌తో కలిసి తిరుగుతానంటూ తెగేసి చెప్పేసింది. లహరి ఆ యువతికి ఫోన్ చేసిన విషయం వెంకటేష్‌కు తెలియగానే అతను రెచ్చిపోయాడు. వెంకటేష్ గత కొంత కాలంగా లహరిపై భౌతిక దాడులకు తెగబడ్డాడు. మానసికంగా, శారీరకంగా లహరిపై దాడులు చేసేవాడు. తన అక్రమ సంబంధం గురించి భార్యకు తెలిసి అడ్డు పడుతుందన్న కోపంతో లహరిని మానసిక వేధింపులకు గురి చేయడమే కాకుండా భౌతికంగా చిత్రహింసలు పెట్టేవాడు. దీనితో లహరి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.