Begin typing your search above and press return to search.
దాడి మాస్టర్ కొడుక్కి కన్ఫర్మ్ అంటగా...?
By: Tupaki Desk | 2 Feb 2023 9:32 AM GMTమొత్తానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు పుత్రోత్సాహం కలిగేలా ఉంది అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు ఏడున్నర పదుల వయసులో ఇపుడు రాజకీయ టెన్షన్ లో ఉన్నారు. అది తన గురించి కాదు, తన రాజకీయ వారసుడు అయిన కుమారుడు దాడి రత్నాకర్ విషయంలోనేనట. దాడి రత్నాకర్ ని ఎమ్మెల్యేగా చూసుకోవాలని పెద్దాయన ఆశ పడుతున్నారు.
దాడి రత్నాకర్ కోసమే పెద్దాయన 2012లో వైసీపీలో చేరారు. ఆయన ఏకంగా జగన్ నాడు ఉన్న జైలుకు వెల్ళి ములాఖత్ ద్వారా కలసి మరీ పార్టీ కండువా కప్పుకున్నారు. దానికి తగినట్లుగానే 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కింది. అయితే దాడి సొంత ఇలాకా అయిన అనకాపల్లిలో కాకుండా విశాఖ వెస్ట్ ఇచ్చారు. చివరి నిముషంలో టికెట్ కేటాయించడం వల్ల దాడి రత్నాకర్ ప్రచారం చేసుకోలేకపోయారు. అంతే కాదు అక్కడ బలంగా టీడీపీ ఉంది. గట్టి ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. నాడు టీడీపీకి అనుకూలంగా గాలి వీచింది.
ఇలా మొదటి సారి పోటీ చేసి రత్నాకర్ ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై కొట్టేసి తప్పు చేశారు. ఆయన తెలుగుదేశంలో చేరుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో 2019లో మళ్ళీ వైసీపీలోకే రీ ఎంట్రీ ఇవాల్సి వచ్చింది. అయితే అప్పటికే పార్టీలు మారుతూ వచ్చారన్న కారణంతో కండువాలు కప్పిన జగన్ టికెట్ మాత్రం ఇవ్వలేదు. అంతే కాదు నామినేటెడ్ పదవులు సైతం తండ్రీ కొడుకులకు ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిని అలా దాచుకుంటూనే వారు పార్టీలో పనిచేస్తున్నారు.
మరో వైపు వేరే ఆప్షన్ల్ లేకపోవడం కూడా అలా చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఇక అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదు అన్నది ఖాయం అయింది. ఆయన వేరే చోట ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇపుడు చాలా మంది అనకాపల్లి టికెట్ రేసులో ఉన్నా జగన్ మాత్రం దాడి మాస్టర్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న వార్తలు పెద్దాయన కుటుంబంలో ఆనందం నింపుతున్నాయట. ఎట్టకేలకు జగన్ కరుణించారని వారు అంటున్నారు.
వచ్చే ఎన్నికల కోసం రెడీ కావాలని వైసీపీ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చింది అని అంటున్నారు. విశాఖ జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్న వైవీ సుబ్బారెడ్డి కూడా దాడి ఫ్యామిలీకే టికెట్ అని సంకేతాలు ఇస్తున్నారు. ఇక రాజ గురువు అయిన స్వామీజీ సైతం దాడి కుటుంబానికి టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేశారని అంటున్నారు. ఈ మధ్య జరిగిన పీఠం వార్షికోత్సవాలకు వెళ్ళిన దాడి రత్నాకర్ స్వామీజీ ఆశీస్సులు నిండుగా పొందారని అంటున్నారు.
ఈ విధంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి వైసీపీ తరఫున దాడి రత్నాకర్ కి టికెట్ కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. అయితే అంగబలం అర్ధబలం రెండూ కచ్చితంగా ఉండాలని కండిషన్ అయితే అధినాయకత్వం నుంచి ఉంది అంటున్నారు. మాస్టర్ హిస్టరీ చూస్తే గతంలో ఎపుడూ పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ వచ్చే ఎన్నికలు కీలకం కాబట్టి గట్టిగానే ఉండాలని హై కమాండ్ ఆదేశం. మరి ఆ విధంగా చేస్తేనే విజయం సొంతం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి మాస్టారు ఈ విషయంలో ఏ రకమైన పాఠాలు నేర్పుతారో లేక నేర్చుకుంటారో అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.