Begin typing your search above and press return to search.
ఆ మాజీ క్రికెటర్ కు నాలుగో భార్య అవుతానంటున్న టిక్ టాక్ స్టార్!
By: Tupaki Desk | 31 May 2023 1:07 PM GMTపాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ గురించి తెలియనివారు లేరు. 1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీ లోనే పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ ను తొలిసారి గెలుచుకుంది. అప్పటి నుంచి మళ్లీ ఆ దేశానికి వరల్డ్ కప్ దక్కలేదు. మంచి ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ పలువురు అందాల భామల తో ఎఫైర్లు నడిపాడు. ఆ తర్వాత పాక్ రాజకీయాల్లోకి ప్రవేశించి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ని స్థాపించి పాక్ ప్రధాని కూడా అయ్యారు.
కాగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కు టైరియన్ వైట్ అనే ఒక కుమార్తె కూడా ఉందని.. ఆ వివరాల ను దాచిపెట్టి ఎన్నికల్లో అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన పై అభియోగాలు ఉన్నాయి. తనకు కేవలం ఇద్డరు కుమారులు మాత్రమే ఉన్నారని ఇమ్రాన్ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
తన కుమార్తె టైరియన్ వైట్ ఉనికిని తెలియనీయకుండా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారని.. అందువల్ల ఆయన పై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అంగీకరించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.
మరో వైపు పాక్ పార్లమెంటులో అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక కేసులు, అరెస్టులు తప్పడం లేదు.
అయితే ఇలాంటి సమయం లోనూ ఇమ్రాన్ ఖాన్ పై యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన యువతి మనసు పారేసుకుంది. ఆయనకు ఒక ప్రతిపాదన చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని వెల్లడించి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు ముగ్గురితో పెళ్లిళ్లయ్యాయి.. వీరిలో ఇద్దరితో విడాకులు కూడా తీసుకున్నారు.
తాజాగా యూకే కు చెందిన జియాఖాన్ అనే టిక్ టాకర్ ఇమ్రాన్ ఖాన్ కు ఈ మేరకు ప్రపోజ్ చేసింది. ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందన్న ఆమె.. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు జియా ఖాన్ చెప్పిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
'ఇమ్రాన్ ఖాన్ ముందు జెమీమా ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ అవసరం. అల్లరి చేస్తూ సరదాగా ఉండే భార్య ఆయనకు కావాలి. నేను అందుకే ఇమ్రాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆయన కు నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఆయన వయసు 70 ఏళ్లు అయినా నాకేం ఇబ్బంది లేదు' అని జియా ఖాన్ ఈ పాక్ ప్రధానిపై ప్రేమను కురిపించింది.
కాగా ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ తో ఇమ్రాన్ వివాహం చెల్లదని ఇటీవల ఓ మతపెద్ద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.
100కు పైగా కేసుల ను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ను ఇటీవల పాక్ పారామిలటరీ విభాగం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య దేశం విడిచి వెళ్లకుండా పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.