Begin typing your search above and press return to search.

దేశవాళీ క్రికెట్ లోక్రీడా స్ఫూర్తి దుమారం.. 5.5 ఓవర్లకు 53 నిమిషాలు

By:  Tupaki Desk   |   9 July 2023 4:55 PM GMT
దేశవాళీ క్రికెట్ లోక్రీడా స్ఫూర్తి దుమారం.. 5.5 ఓవర్లకు 53 నిమిషాలు
X
ఇటీవల యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టోను ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఔట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉన్న సమయంలో.. బెయిర్ స్టో బంతిని ఆడి క్రీజు విడిచి బయటకు రావడం కేరీ బంతిని వికెట్ కేసి కొట్టడం థర్డ్ అంపైర్ కూడా ఔటివ్వడం జరిగిపోయాయి. నిబంధన ప్రకారం సరైనదే అయినా.. క్రీడా స్ఫూర్తి ఏదంటూ పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్ లోనూ ఇదే తరహా చర్చ రేగుతోంది.

రంజీ ట్రోఫీ తర్వాత దేశవాళీలో దులీప్‌ ట్రోఫీ కీలకమైనది. రంజీ ట్రోఫీ రాష్ట్రాల మధ్య జరిగితే.. దులీప్ ట్రోఫీ జోన్ల మధ్య ఉంటుంది. ఇందులో శనివారం సౌత్ జోన్ ఫైనల్ కు చేరింది. అయితే నార్త్ జోన్ తో జరిగిన ఈ రెండో సెమీ ఫైనల్‌ కు వర్షం అంతరాయం కలిగింది. చివరికి రెండు వికెట్ల తేడాతో సౌత్ జోన్‌ నెగ్గింది. కానీ ఆటకు చివరి రోజు శనివారం నార్త్ బౌలర్లు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది.

సౌత్ జోన్ 215 పరుగుల టార్గెట్ తో బరిలో దిగింది. ఛేదనలో 183/4 వద్ద ఉండగా వర్షం పడింది. కొద్దిసేపటికే తెరిపినివ్వడంతో ఆట తిరిగి మొదలైంది. 36.1 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 219 పరుగులు చేసిన సౌత్‌ ఫైనల్ కు చేరింది. కానీ, ఇక్కడే మలుపుంది.మిగిలిన 32 పరుగులను సౌత్ కేవలం 5.5 ఓవర్లలోనే చేసింది. కానీ, నార్త్ బౌలర్లు ఇదే సమయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు.


టీమిండియా మాజీ క్రికెటర్ సారథ్యంలో

జయంత్ యాదవ్ టీమిండియా మాజీ క్రికెటర్. అతడి సారథ్యంలోని నార్త్ బౌలర్లు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతోంది.దీనిపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 5.5 ఓవర్లను వేసేందుకు 53 నిమిషాలు పట్టడం ఏమిటని నిలదీస్తున్నారు.


ఓవర్ కు పది నిమిషాలా?

ఇంటర్నరేషనల్ క్రికెట్ లో ఓవర్లలో వికెట్ పడినప్పటికీ గంటకు కనీసం 14 ఓవర్లు వేస్తారు. అయితే, దులీప్ ట్రోఫీ సెమీస్ లో 6 ఓవర్లను వేసేందుకు కావాలనే జాప్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆలస్యం చేయడం వల్ల మళ్లీ వర్షం పడితే నార్త్ కు గెలిచే చాన్స్ ఉండేది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆ జట్టుకే దక్కింది. దీంతోనే నార్త్ జోన్ వ్యవహరించిన తీరును అందరూ తప్పుబడుతున్నారు.