Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిగా తిరుపతి.. తెరపైకి తీసుకొచ్చిన గంగుల

By:  Tupaki Desk   |   30 Dec 2020 7:48 AM GMT
ఏపీ రాజధానిగా తిరుపతి.. తెరపైకి తీసుకొచ్చిన గంగుల
X
కొత్త ఏడాదికి మరో రెండు రోజులే సమయముంది. నూతన సంవత్సరం సంగతి ఎలా ఉన్నా.. ఏపీ రాజధానిపై కొత్త రచ్చకు రంగం సిద్ధమవుతోంది. అమరావతి రాజధాని స్థానే.. పాలనా సౌలభ్యం కోసం జగన్ సర్కారు మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విపక్షం చేస్తున్న రచ్చ రాజకీయ కలకలాన్ని రేపుతుంటే.. మరో కొత్త డిమాండ్ తెర మీదకు రానుంది. సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి కొత్త వాదానని తెర మీదకు తీసుకొచ్చారు.

ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని కోరుతూ ఆయన కొత్త డిమాండ్ ను వినిపించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రేటర్ రాయలసీమ వాదాన్ని వినిపించిన ఆయన.. ఆరు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నది లేదు. తాను ప్రస్తావించిన గ్రేటర్ రాయలసీమ వాదాన్ని పట్టించుకోని కాంగ్రెస్.. ఏపీలో కనుమరుగైందని గుర్తు చేస్తారు.

సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలన్న డిమాండ్ పై తాను యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఊపందుకుంటుందని.. ఇదో పెద్ద ఇష్యూగా మారుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజధాని కాస్తా మూడు రాజధానులు కావటం.. ఇప్పుడు తిరుపతిని కొత్త రాజధానిగా డిమాండ్ తెర మీదకు రావటం చూస్తే.. వచ్చే ఏడాది మొదట్లో మరో రచ్చ సిద్ధంగా ఉందని చెప్పక తప్పదు.