Begin typing your search above and press return to search.
ఆకాశంలో ట్రాఫిక్ జామ్..! ఎగిరే కార్లు వస్తే ఈ వార్త నిజమవుతుందా?
By: Tupaki Desk | 18 Feb 2021 12:30 AM GMTఆకాశంలో ట్రాఫిక్ జామ్ అవుతుందా? త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయంట. ఇప్పటికే అనుమతులు వచ్చేశాయట. అయితే ఎగిరే కార్లు వస్తే ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అనే వార్త నిజమవుతుందేమో? చాలా కాలంగా ఎగిరే కార్లు వచ్చేస్తాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడా వార్తలు నిజమయే అవకాశం కనిపిస్తుంది. ఆకాశంలో ఎగిరే కార్లను తిప్పుకొనేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసిందట.
ఈ ఎగిరే కార్లు 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణిస్తాయట. వీటికి అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు ఇచ్చేసింది. టెర్రాఫుజియా ట్రాన్సిషన్ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఎఫ్ఏఏ ప్రత్యేక లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అనుమతులు వచ్చాయి.
ఈ ఎగిరే కారు రెక్కల పొడవు 27 అడుగులు. పైలట్లు, ఫ్లైట్ స్కూళ్ల కోసం ప్రస్తుతం ఇందులో ఫ్లైట్ వెర్షన్ ఉంది. అయితే ఈ కారును అందరు నడిపే చాన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉంటేనే ఈ కారును నడిపే చాన్స్ ఉందని చైనీస్ కంపెనీ అయిన టెర్రాఫుజియా స్పష్టం చేసింది. ఇప్పటికే 80 ఎగిరే కార్లు టెస్టింగ్‌ను కూడా పూర్తిచేసుకున్నాయట.