Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్ లోంచే సినిమా వీక్ష‌ణ‌

By:  Tupaki Desk   |   5 Feb 2023 1:14 PM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్ లోంచే సినిమా వీక్ష‌ణ‌
X
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టూరిస్టుల‌కు వినోదాల‌ స్వ‌ర్గ‌ధామంగా మారుతోంది. ఇక్క‌డ అనేక సౌక‌ర్యాలు ప్ర‌యాణీకుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న ల‌క్ష‌లాది ప్ర‌యాణీకుల వినోద విహార అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని పోర్ట్ యాజ‌మాన్యం అంత‌కంత‌కు సౌక‌ర్యాల‌ను పెంచుతోంది.

ఇక్క‌డ గోకార్డింగ్ అందుబాటులో ఉంది. వీఆర్ గేమింగ్ ని అనుభూతి చెందే సౌలభ్యం ఎంతో ఆక‌ర్షిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి విమానాశ్ర‌య‌ బ్రూవరీ- ఫ్రీ-రోమింగ్ VR గేమింగ్ అనుభవం ఇక్క‌డ మాత్ర‌మే పాజిబుల్. ఎఫ్ అండ్ బి బ్రాండ్ లు- సూపర్ మార్కెట్ లతో ఎయిర్ పోర్ట్ నిరంత‌రం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది.

ఇప్పుడు మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్ ను శంషాబాద్ విమానాశ్ర‌యానికి జోడిస్తున్నారు. ఇది డ్రైవ్ - ఇన్ థియేట‌ర్. అంటే ఒక లార్జ్ స్క్రీన్ పై సినిమాల‌ను ఇక్క‌డ కార్ లోంచే వీక్షించే సౌల‌భ్యం అందుబాటులోకి రానుంది. ఇది దేశంలో మొదటి ఎయిర్ పోర్ట్ డ్రైవ్-ఇన్ థియేటర్ గా పాపుల‌ర్ కానుంది. ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు కానుంది. డ్రైవ్-ఇన్ థియేటర్ ప్యాసింజర్ టెర్మినల్ భ‌వంతి ముందు భాగంలో పెద్ద స్క్రీన్ ను ఏర్పాటు చేస్తారు. ఇక్క‌డ చాలా కార్ల పార్కింగుకి వసతి ఉండ‌డంతో ఇక సినిమా వినోదం మ‌రింత సుల‌భ‌త‌రంగా మార‌నుంది. చాలా స‌మ‌యాన్ని ప్ర‌యాణీకులు వృథా చేసుకోన‌వ‌స‌రం లేదు. ఇక్క‌డ త‌మ స‌మ‌యాన్ని ఆస్వాధ‌న కోసం ఉప‌యోగించుకునే వీలుంటుంది.

ఆక్వా గోల్ఫ్ అనేది డ్రైవింగ్ శ్రేణిని పోలి ఉంటుంది. సరస్సులోని టార్గెట్ లోకి బంతులను కొట్టే డ్రైవింగ్ వ‌రుస ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. గత సంవత్సరం ప్రారంభించబడిన ఏరో ప్లాజా ప్ర‌యాణీకుల‌కు ఇప్పుడు అతిపెద్ద అద‌న‌పు బోన‌స్ పాయింట్ గా మారింది.

నిజానికి శంషాబాద్ విమానాశ్రయం విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. విమానాశ్ర‌యం మొత్తం వైశాల్యాన్ని పెంచే ప‌నిలో ఉన్న యాజ‌మాన్యం ప్రతి సంవత్సరం 3.5 కోట్ల మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి విస్త‌రిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్ మెంట్ (GSE) టన్నెల్ ను కూడా కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి త‌ర‌హా సురక్షితమైన ప్రయాణీకుల త‌ర‌లింపు.. వారి సామాను తరలింపును అందించడానికి స‌హ‌క‌రిస్తుంది. ఈ వాహనం విమానాల కదలిక సమయంలో సమయ వృథా కాకుండా సాయ‌ప‌డుతోంది. GSE టన్నెల్ 42 రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్ లకు విస్తర‌ణ‌కు త‌గ్గ‌ట్టుగా ప్రయాణీకుల టెర్మినల్ రిమోట్ గేట్ల ప్రాంతానికి వెళ్లే హెడ్ ఆఫ్ స్టాండ్ రోడ్ తో అనుసంధాన‌మై ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.