Begin typing your search above and press return to search.
ప్రకాశం బ్యారేజి దిగువన రెండు బ్యారేజిలు..ఆదేశాలు జారీచేసిన జగన్ సర్కార్!
By: Tupaki Desk | 18 Sep 2020 9:50 AM GMTఏపీలో గత ఏడాది భారీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి , అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య , నీటి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే విద్యారంగం లో కీలక మార్పులు , సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా నీటి ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరందించాలని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ , తాజాగా కృష్ణా డెల్టాకు తాగునీరు అందించడానికి ప్రకాశం బ్యారేజి దిగువన మరో రెండు బ్యారేజీ ల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు.
ప్రకాశం బ్యారేజి దిగువన మరో రెండు బ్యారేజ్ లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రపురం మధ్య, ప్రకాశం బ్యారేజ్ కి పన్నెండు కిలోమీటర్ల దిగువున బ్యారేజీ నిర్మించనున్నారు.అలాగే ఎం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండి కొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన మరొక బ్యారేజ్ ని నిర్మించదలిచారు . ఈ రెండు బ్యారేజీ ల కోసం కోసం ఇన్వెస్టిగేషన్ పనులకు , సర్వే నిర్వహించడానికి, భూసేకరణ చేయడానికి 204. 37 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరడం, భారీ వర్షాలకి , వరదల సమయంలో కృష్ణానదీ జలాలను వృధాగా సముద్రంలోకి వదిలివేయటం దృష్టిలో పెట్టుకొని కృష్ణా నది పరివాహక ప్రాంతాల లో ఉన్న ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంలో నీటిని అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ తొలిదశ పరిపాలన ఉత్తర్వులను ఇచ్చారు. ఏపీకి వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవడమే తమ లక్ష్యం అని తెలిపారు. ఈ ఏడాది కృష్ణా నదికి వరదలు పోటెత్తాయి. శ్రీశైలం జలాశయానికి అదనంగా 3,38,823 క్యూసెక్కుల నీరు చేరుతుంది. జూరాల, సుంకేసుల, హంద్రీలనుండి 2,28,991 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. శ్రీశైలంజలాశయం గరిష్ట నిల్వ దాటి కృష్ణా కృష్ణా నదిలోకి నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
నాగార్జున సాగర్ లో 589.7 అడుగుల్లో 311 .15 టీఎంసీల నీటిని స్థిరంగా నిల్వ చేస్తూ, 18 గేట్లు ఎత్తి మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి వదులుతున్న నీటిలో కొంత పులిచింతల ప్రాజెక్టు లకు చేరుతుండగా, మిగతా నీరు ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ లో సైతం నీటి నిల్వ సామర్థ్యం మించి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ లోని గేట్లను ఎత్తివేసి 3,79,389 క్యూసెక్కుల నీటిని వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీటిని కూడా వృధాగా పోనివ్వకుండా కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీటిని అందించాలని కృష్ణా నది పై మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించారు.