Begin typing your search above and press return to search.

ఆ కిళ్లీ తింటే 'పట్టే మంచాలు' పదైనా విరగాల్సిందే!

By:  Tupaki Desk   |   10 Nov 2020 9:50 AM GMT
ఆ కిళ్లీ తింటే  పట్టే మంచాలు పదైనా విరగాల్సిందే!
X
బెడ్ రూమ్ లో భాగస్వామిని సుఖ పెట్టి మగ మహరాజు అనిపించు కోవాలని ఏ మగాడికి ఉండదు చెప్పండి. అందరికీ అక్కడ కింగ్ అనిపించు కోవాలనే ఉంటుంది. కానీ పట్టే మంచం విరిచేంత దూకుడు ప్రతీ సారి ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ఎలాగైనా పార్ట్నర్ ని సంతోష పెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఒంట్లో కాస్త శక్తి తక్కువ ఉన్నవారు వయాగ్రా వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. కాగా మహారాష్ట్ర ప్రజలకు ఈ బాధ లేదట. సింపుల్ గా ఓ కిళ్లీ వేసుకుంటే చాలు రెండ్రోజులు పడక గదిలో పండగ చేసుకోవచ్చట. రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు ఇక ఆ కిళ్లీకి ఫుల్ గిరాకీ ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో తారా పాన్ సెంటర్లో మాత్రమే ఈ కోహినూర్ అనే కిళ్లీ దొరుకుతుంది. ఇక్కడ పడక గదిలో రెచ్చిపోయే కిళ్లీ మాత్రమే స్పెషల్ గా తయారు చేస్తారు. అది తింటే 48 గంటలు ఏకధాటిగా భాగస్వామిని సుఖ పెట్టవచ్చంట. ఈ కోహినూర్ కిళ్లీ కోసం వచ్చేవారితో ఆ పాన్ సెంటర్ కిట కిట లాడుతూ ఉంటుంది.

ఇంతకీ ఆ కిళ్లీ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాని ధర అక్షరాలా రూ. 5000 రూపాయలు. దానికి ఎందుకు అంత ధర అంటే ఆ కిళ్లీలో వాడే మూలికలే కారణమని చెబుతున్నారు. ఈ కిళ్లీలో వేసే ‘కస్తూరీ’ కిలో రూ.70 లక్షలు విలువ ఉంటుంది. దీనితోపాటు కుంకుమ పువ్వు కూడా వాడతారు. ఇది కిలో రూ.70 వేలు. కిలో రూ.80 వేలు విలువ చేసే గులాబ్, రూ.7 లక్షల విలువ చేసే అగర్ ఈ కిళ్లీలో కలుపుతారు. ఇవి కాకుండా కొన్ని రహస్య పదార్థాలను పాన్ షాప్ యజమాని కిళ్లీలో యాడ్ చేస్తారు. స్త్రీలకు మూడ్ తెప్పించే కిళ్లీలు కూడా ఇక్కడ వెరీ స్పెషల్. గులాబ్, తెల్ల ముస్లీలను కిళ్లీలో చేర్చి ఇస్తారు. ఈ కిళ్లీ తింటే లేడీస్ కూడా రెచ్చిపోయి పురుషులకి సహకరిస్తారంటా. అందుకే మహారాష్ట్రలో పెళ్లిళ్ల సీజన్లో తారా పాన్ సెంటర్ వద్ద జనాలు క్యూ కట్టి ఉంటారట. ఇంకో ట్విస్ట్ ఏమీటంటే ఈ కిళ్లీలలో కలిపే రహస్య పదార్థాలు షాప్ యజమాని మహ్మద్ సిద్ధికీ, అతడి అమ్మకు మాత్రమే తెలుసట. అంత లాభం తెచ్చే కిళ్లీ తయారీ వివరాలు బయట పడకుండా వారి కుటుంబం దశాబ్దాలుగా ఆ బిజినెస్ చేస్తోంది. 48 గంటల పాటు మగ మహారాజులా నిలవాలనుకుంటున్న వారు ఓసారి కిళ్లీ వైపు లుక్కేయవచ్చు.