Begin typing your search above and press return to search.
సవిత కోసం... శరత్ గా మారిన సరిత!
By: Tupaki Desk | 1 July 2023 8:00 AM GMTఈమధ్య కాలంలో లింగ్ మార్పిడి చేయించుకునే సంఘటనలు రెగ్యులర్ గా మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఇండియన్స్ కాస్త తక్కువానే ఉంటారని అంటుంటారు. అయితే తాజాగా ఒక భారతీయ మహిళ... లింగ మార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడిగా మారిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పుర్ జిల్లా ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాడా గ్రామానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు లింగమార్పిడి చికిత్సతో పురుషుడిగా మారింది. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం కూడా ఆమె పొందారు.
డిగ్రీ పూర్తిచేసిన సరితా సింగ్‌కు మూడేళ్ల కిందట ప్రాథమిక విద్యా మండలిలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. 2020లో లింగమార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారాలని నిర్ణయించుకుని.. లక్నోలో హార్మోన్ మార్పిడి థెరపీ తీసుకుంది.
దాంతో ఆ థెరపీ వర్కవుట్ అయ్యి కొంతకాలానికి పురుషుడిలా గొంతు మారడం, గడ్డం రావడం వంటి మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిగా పురుషుడిగా మారింది.
తన పేరును సరితా సింగ్ నుంచి శరత్ సింగ్ గా మార్చుకున్నారు. ఈ మేరకు షాజహాన్ పుర్ జిల్లా మేజిస్ట్రేట్ ఉమేశ్ ప్రతాప్ సింగ్ నుంచి లింగమార్పిడి ధ్రువీకరణ పత్రం కూడా ఆమె అందుకున్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో అమరుడైన ఠాకూర్ రోషన్ సింగ్ మునిమనవరాలు సరితాసింగ్ దివ్యాంగురారు. ఆమెకు చిన్నతనం నుంచి అబ్బాయిల్ని దుస్తులు ధరించడం, వారిలా హెయిర్ స్టైల్ చేసుకోవడం ఇష్టం అట. అమ్మాయిగా పుట్టినా ఆమె ప్రవర్తన అచ్చం అబ్బాయిలాగే ఉండేదని తెలుస్తుంది.
అయితే దివ్యాంగురాలైన సరిత ఎక్కువ సమయం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఈ సమయంలో సవితా సింగ్ అనే యువతి ఆమెకు సహకరిస్తూ... చదువులో కూడా అండగా నిలిచిందంట. ఈ నేపథ్యంలో సవితను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రస్తుతం శరత్ సింగ్ మారిన సరిత సింగ్ నిర్ణయించుకున్నారని. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.