Begin typing your search above and press return to search.
3 వెర్షన్లలో వందే భారత్.. ఎంత వేగంగా తయారు చేస్తున్నారంటే?
By: Tupaki Desk | 26 May 2023 10:10 AM GMTభారత్ రైలు ముఖచిత్రాన్ని మార్చేసే రైలుగా మారింది వందే భారత్. ఇప్పటివరకు పట్టాల మీద పరుగులు తీసే రైళ్లకు భిన్నంగా.. మారుతున్న దేశ స్థాయికి అనుగుణంగా వందే భారత్ మారిందని చెప్పాలి. ఈ రైల్లో ప్రయాణం వేగవంతంగా.. సౌకర్యవంతంగా.. కులాసాగా ఉండటం వరకు బాగానే ఉన్నా.. దీని టికెట్ ఖర్చుతోనే ఇబ్బంది అంతా. భారత్ లాంటి దేశంలో చౌకైన ప్రజా రవాణాగా ఉన్న రైళ్ల తీరుకు భిన్నంగా.. జీవితంలో ఒకసారైనా వందే భారత్ ఎక్కాలన్న భావన కలిగేలా చేసిన వైనం వేదనకు గురి చేయక మానదు.
వందే భారత్ రైలు టికెట్ ఖర్చు మినహా.. మరే ఇతర కంప్లైంట్ లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. వందే భారత్ కు సంబంధించిన రెండు కీలక విషయాల గురించి తెలిస్తే సర్ ప్రైజ్ కు గురి కాక మానదు. అదేమంటే.. ఇప్పటివరకు వందే భారత్ సిట్టింగ్ (ఛైర్ కార్) మాత్రమే అందుబాటులో ఉంది.
త్వరలో స్లీపర్ సౌకర్యంతో ఉన్న రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. వందే భారత్ ను మొత్తం మూడు వెర్షన్లలో తీసుకు రావాలన్న ప్లాన్ చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. ఈ మూడు వెర్షన్ల విభజన ఆసక్తికరంగా మారింది.
100కి.మీ. లోపు దూరానికి వందే మెట్రో పేరుతో వేగంగా పరుగులు తీసే ట్రైన్ అందుబాటులోకి రానుండగా.. 100కి.మీ. నుంచి 550 కి.మీ. దూరానికి వందే ఛైర్ కార్ ట్రైన్లు వినియోగిస్తారు. ఇప్పటికే ఈ రైళ్లు పట్టాల మీద పరుగులు తీస్తున్నాయి.
ఇక.. మూడో వెర్షన్ వందే భారత్ స్లీపర్. వీటిని 550కి.మీ నుంచి ఆ పైబడిన ప్రయాణానికి ఈ రైళ్లను వినియోగిస్తారు. ఈ మూడు వెర్షన్ ట్రైన్లు వచ్చే ఫిబ్రవరి - మార్చి నాటికి సిద్ధం కానున్నట్లు చెబుతున్నారు. జూన్ నాటికి ప్రతి రాష్ట్రంలోనూ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒక వందే భారత్ ట్రైన్ ను తయారు చేయటానికి ఎన్ని రోజులు పడుతుందన్న లెక్క వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రతి 8-9 రోజులకు ఒక వందే భారత్ రైలు బయటకు వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు తయారు చేస్తున్న ఫ్యాక్టరీకి అదనంగా మరో రెండు ఫ్యాక్టరీలను వందే భారత్ రైళ్ల తయారీ కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం 70-80 కి.మీ. వేగాన్ని తట్టుకునే ట్రాకులు మాత్రమే ఉండగా.. రానున్న నాలుగైదు సంవత్సరాల్లో గంటకు110-130కి.మీ. వేగాన్ని తట్టుకునే ట్రాకులతో పాటు గంటకు 135 కి.మీ. వేగాన్ని తట్టుకునే ట్రాకుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ అప్ గ్రేడ్ చేసిన ట్రాకుల పరిది 30-35 వేల కి.మీ. వరకు ఉంటుందని చెబుతున్నారు.
అంతేకాదు.. రైలు ప్రయాణికులకు 4జీ..5జీ సేవలు మరింత నాణ్యంగా అందుబాటులోకి వచ్చేలా కొత్త టవర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా నాలుగైదేళ్లలో భారతీయ రైలు ముఖచిత్రంమారిపోతుందన్న విషయం అర్థమవుతుంది. అదే సమయంలో.. సామాన్యుడికి రైలుబండి దూరం కానుందా? అన్న సందేహం కలుగక మానదు.