Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఎంత ఇష్టమైతే మాత్రం.. మరీ ఇంతలా ‘6’ భజనేంటి వేముల?
By: Tupaki Desk | 6 Nov 2020 10:10 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తెలిసిన వారందరికి దాదాపుగా ఆయన లక్కీ నెంబరు ఆరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ ‘6’ మిస్ కాకుండా చూసుకుంటారు. అంతలా ఆయన ఆరును విశ్వసిస్తుంటారు. అధినేత మనసు దోచుకోవాలని అనుకున్నారేమో కానీ.. తాజాగా రాష్ట్ర రహదారులు - భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన తాజా రివ్యూ సమావేశం ‘ఆరు’ భజనగా మారినట్లు చెబుతున్నారు. రివ్యూ ప్రారంభమైన నాటి నుంచి పూర్తి అయ్యేవరకు ఆరు జపం చేస్తూనే ఉన్నారట.
ముఖ్యమంత్రి కేసీఆర్ కలగా చెప్పే కొత్త సచివాలయ నిర్మాణాన్నియుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బావిస్తున్న సంగతి తెలిసిందే. రికార్డు సమయంలో ఏడాదిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా.. పన్నెండు నెలల్లో కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించాలన్న దానిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. పక్కా ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పిన ఆయన.. ప్రాజెక్టును ఆరు భాగాలుగా చేయాలని.. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలన్నారు.
ఆరు ప్రాజెక్టులకు ఆరు టీంలు ఉండాలని.. అదే సమయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి ఆరు టీంలు పని చేయాలన్నారు. నిర్మాణ పనుల్ని తాను ప్రతి వారం స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ముందుగా అనుకున్నట్లు 12 నెలల్లో కాకుండా పదకొండు నెలల్లోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేయాలన్నారు. అన్ని బాగున్నాయి కానీ.. ప్రతి వారం కంటే కూడా ఆరు రోజులకోసారి రివ్యూ చేస్తానని చెబితే మరింత బాగుండేదేమో మంత్రిగారు అన్న మాట వినిపిస్తోంది.