Begin typing your search above and press return to search.
అసలు ఎవరీ కైలాస దేశ ప్రతినిధి విజయప్రియ నిత్యానంద?
By: Tupaki Desk | 1 March 2023 9:17 PM GMTభారత్ లో పలు కేసుల పాలై బెయిల్ పై విడుదలై విదేశాలకు పారిపోయిన నిత్యానంద ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. ఈశ్వడార్ దేశంలోని ఒక దీవిలో తన ఆశ్రమం ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక దేశంగా మలిచి ఐక్యరాజ్యసమితిలోకి తన ప్రతినిధిని పంపించాడు. వివాదాస్పద గురువు నిత్యానంద తన దేశం 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'గా పేర్కొన్నాడు. అంతేకాదు.. తన ప్రతినిధిని ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశానికి పంపించారు.. ఈ సమావేశంలో 19వ ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్ఆర్) లో 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'కు విజయప్రియ నిత్యానంద అనే మహిళ ప్రాతినిధ్యం వహించింది. ఆమె మాట్లాడుతూ 'హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్' మా కైలాస దేశం అని.. భారత్ నుంచి తమ రక్షణ కల్పించాలని అన్నారు.
నిత్యానంద భారతదేశంలో అనేక ఆశ్రమాలను నిర్వహించేవాడని, అయితే లైంగిక వేధింపులు , వేధింపుల ఆరోపణలతో అతను దేశం విడిచి పారిపోయాడు. సీఈఎస్ఆర్ సమావేశంలో విజయప్రియ నిత్యానంద గళమెత్తారు. భారతదేశం మా నిత్యానందను హింసించే లక్ష్యంతో చూస్తోందని.. దీనిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరారు.
ఐక్యరాజ్యసమితి అప్లోడ్ చేసిన మీటింగ్ వీడియోలో విజయప్రియ 'కైలాస నుండి శాశ్వత రాయబారి'గా తనను తాను చెప్పుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ 'కొత్త దేశం కైలాస'ని గుర్తించిందా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.
-అసలు ఎవరీ విజయప్రియ ?
లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. విజయప్రియ 2014లో కెనడాలోని మనిటోబా యూనివర్సిటీ నుంచి మైక్రో బయాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్నప్పుడు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ డీన్ హానర్ జాబితాలో ఆమె పేరు కూడా ఉందట.. 2013, 2014లో ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను కూడా పొందారు. ఆమె ఏ దేశానికి చెందినవారో స్పష్టత లేనప్పటికీ ఇంగ్లీష్, ఫ్రెంచ్ క్రియోల్, పెజిన్స్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే ఆమె ఐరాస లో కైలాస రాయబారిగా నియమించారు. ఈమె నిత్యానందకు నమ్మినబంటు. ఆయన భక్తురాలు. అందుకే ఈ అత్యున్నత పదవి ఇచ్చారు.
"కైలాస, హిందూమతం యొక్క మొదటి సార్వభౌమ రాజ్యంగా నిత్యానంద ప్రకటించారు. హిందూమతం యొక్క సుప్రీం పోంటీఫ్ ను కైలాస దేశంలో నిత్యానంద పరమశివం స్థాపించారు, అతను జ్ఞానోదయమైన హిందూ నాగరికతను , ఆది శైవ దేశీయ వ్యవసాయ తెగలతో సహా హిందూ మతం యొక్క 10,000 సంప్రదాయాలను పునరుజ్జీవింపజేస్తున్నాడు" అని తెలిపారు.
కైలాసలో నివసిస్తున్న నిత్యానందతోపాటు 20 లక్షల మంది హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని విజయప్రియ అన్నారు. కైలాస 150 దేశాల్లో రాయబార కార్యాలయాలు, ఎన్జీవోలను ఏర్పాటు చేసిందని విజయప్రియ పేర్కొన్నారు.
2010లో నిత్యానందపై అత్యాచారం, పిల్లలపై అత్యాచారం ఆరోపణలు రావడంతో కర్ణాటక సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కైలాస యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇది "సరిహద్దులు లేని దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిష్కరణకు గురైన హిందువులు వారి స్వంత దేశాల్లో హిందూ మతాన్ని నిశ్చయంగా ఆచరించే హక్కును కోల్పోయారని.. వారంతా కైలాస దేశం రావాలని కోరారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.