Begin typing your search above and press return to search.
ఆడియో వైరల్: విద్యార్థి ముఖం పగులగొడతానన్న ఎమ్మెల్యే
By: Tupaki Desk | 6 July 2021 1:30 AM GMTప్రజాప్రతినిధులు బొత్తిగా మర్యాద మరుస్తున్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు సమస్యలపై విన్నవిస్తే కసురుకుంటున్నారు. తిట్టిపోస్తున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి సాయం చేయాల్సిందిగా తన నియోజకవర్గ ఎమ్మెల్యేకు కాల్ చేశాడు. సాయం సంగతి అటుంచి తనకే ఫోన్ చేస్తావా? అని ఆ ఎమ్మెల్యే తిట్ల దండకం మొదలు పెట్టాడు. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే బుక్ అయిపోయారు.
కేరళలోని కొల్లాం సీపీఎం ఎమ్మెల్యే,నటుడు ఎం.ముఖేష్ కు రెండు రోజుల క్రితం అతడి నియోజకవర్గానికి చెందిన ఓ పదోతరగతి విద్యార్థి కాల్ చేశాడు. తను ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చెప్పి ఎమ్మెల్యేను సాయం చేయాల్సిందిగా కోరాడు.
దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్ నీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెప్పగా.. ముఖేష్ ఆగ్రహంతో 'నీ స్నేహితుడి ముఖం పగుల కొట్టాలి. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్ తీసుకొని నీ ముఖం పగులకొట్టేవాడిని' అంటూ దురుసుగా మాట్లాడాడు. విద్యార్థి సమస్య కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు.
ఎమ్మెల్యే సీరియస్ కావడంతో భయపడిన సదురు విద్యార్థి 'తప్పయ్యింది సార్.. క్షమించండి ' అని కోరాడు. కానీ ఎమ్మెల్యే విద్యార్థి మాట వినకుండా ఎదురుదాడి చేశాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖేష్ పరువు పోయింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఎమ్మెల్యే ముఖేష్ దీనిపై వివరణ ఇచ్చాడు.ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. 'ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఫోన్ కాల్స్ నిర్విరామంగా వస్తున్నాయని.. ఏవోవే ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారని.. ప్లాన్ ప్రకారం నన్ను కొందరు ఇబ్బంది పెట్టడానికే కాల్ చేస్తున్నారని ఎమ్మెల్యే ముఖేష్ తెలిపాడు. ఆ రోజు కూడా నేను జూమ్ మీటింగ్ లో ఉండగా ఫోన్ కాల్ రావడంతో డిస్ట్రబ్ అయ్యానని.. కోపంతో అలా కొడుతాను అన్నానని' ఎమ్మెల్యే వివరణ ఇచ్చాడు. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యే ముఖేష్ తెలిపారు.