Begin typing your search above and press return to search.
హలో హలో..... బీఎస్ఎన్ఎల్ ముద్దు... విశాఖ ఉక్కు వద్దా...?
By: Tupaki Desk | 8 Jun 2023 3:04 PM GMTకేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ముద్దు, విశాఖ ఉక్కు కర్మాగారం మాత్రం వద్దు అన్నట్లుగా కేంద్ర పెద్దల తీరు ఉంది అని అంటున్నారు. లేకపోతే రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే అయినా బీఎస్ఎన్ఎల్ కి మాత్రం ఆర్ధిక మద్దతుగా మూడున్నర లక్షల కోట్ల సాయాన్ని కేంద్రం చేసింది.
అదే చేత్తో కేవలం అయిదంటే అయిదు వేల కోట్ల రూపాయలను విదిలించడానికి మాత్రం మనసు రాలేదని విమర్శల జడివాన కురుస్తోంది. గత రెండున్నరేళ్ళుగా ఎండనకా వాననకా విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమిస్తున్నారు. వారంతా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయరాదని రోడ్డెక్కారు. ఢిల్లీ బాట పెట్టి కేంద్ర పెద్దలందరినీ కలిశారు.
అయినా సరే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాల్సిందే అంటోంది కేంద్రం. ప్రభుత్వ రంగ సంస్థలు భారమని కేంద్ర పెద్దలు చెబుతూ వస్తున్నారు. అదే టైం లో బీఎస్ఎన్ఎల్ కి మాత్రం ఏకంగా మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.
ఇపుడు ఈ వార్తే ఉక్కు కార్మికులను మండిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మా తోటి సంస్థ. దాన్ని ఆదుకోవడాన్ని ఏ విధంగానూ తప్పు పట్టమని, అదే టైం లో విశాఖ ఉక్కు ఏమి పాపం చేసిందని వారు అంటున్నారు. అయిదు వేల కోట్ల రూపాయలు ఇస్తే క్యాపిటివ్ మైన్స్ తో పాటు క్యాపిటల్ ఫండింగ్ కి కూడా సర్దుబాటు చేసుకుంటామని చెబుతున్నారు.
ఈ మొత్తం లేక చాలక విశాఖ ఉక్కు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని వారు గుర్తు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిజానికి లాభాలతో నడిచే ప్లాంట్ అని సొంత గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయని ఇప్పటికి అనేక మార్లు చెప్పినా కేంద్ర పెద్దలకు పట్టలేదని, ఆఖరుకు అయిదు వేల కోట్ల ఆర్ధిక సాయం చేయడానికి కూడా సిద్ధంగా లేకపోవడం దారుణం అని అంటున్నారు.
ఇపుడు బీఎస్ఎన్ఎల్ కి ఆర్ధిక సాయం వార్త తెలిసాక మరింతగా విశాఖ ఉక్కుఉద్యమాన్ని చేయాలని కార్మిక వర్గాలు ఆలోచిస్తున్నాయి. కేంద్రం వివక్ష చూపిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ఎందుకు చేయాలన్న దాని మీద కూడా కార్మిల లోకం ప్రశ్నిస్తోంది. వాటిని కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం ఉందని గుర్తు చేస్తోంది.
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కానీయమని గత కొంతకాలంగా ఉద్యమిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కూడా విశాఖ స్టీల్ కి ఆర్ధిక సాయం చేసి తీరాల్సిందే అని కేంద్రం మీద డిమాండ్ పెడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కి ఇచ్చిన తరహాలోనే విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక ఆర్ధిక ప్యాజేకిని ప్రకటించాలని దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వ వైభవానికి చేరువ అవుతుందని ఆయన అంటున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.