Begin typing your search above and press return to search.
గుడ్ క్వశ్చన్ - హరీష్ రావు ఎక్కడ?
By: Tupaki Desk | 19 Jun 2019 9:49 AM GMTతెలంగాణ మిషన్- 2024 టార్గెట్ గా బీజేపీ ప్రతి అంశంపై శరవేగంగా రియాక్ట్ అవుతోంది. నగరంలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కనీసం ప్రొటోకాల్ కోసం కూడా తెలంగాణ శాసనసభ్యుల క్వార్టర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపకపోవడం కేసీఆర్ సంస్కారానికి నిదర్శనం; అలాంటి ఈయన మహారాష్ట్ర సీఎంని ఆహ్వానించారట. అవసరానికి రంగులు మార్చే కేసీఆర్ బుద్ధి తెలుసు కాబట్టే ప్రారంభోత్సవానికి రావొద్దని మహరాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రాజెక్టుల కోసం అహరహం శ్రమించిన హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదే అంటూ ఆయన కేసీఆర్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీష్ రావుకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. తన కొడుకుకు ఇచ్చినట్టు పార్టీ కీలక పదవి కూడా ఇవ్వలేదు, తనకు, తన కుటుంబానికి పదవులు దక్కితే చాలనుకునే వ్యక్తి కేసీఆర్ అంటూ విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఏం చేయలేదని కేసీఆర్ అంటున్నారు... బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రాజెక్టు కోసం కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌రావును అడిగి తెలుసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. మోడీ సహకరించకపోతే కాళేశ్వరం పూర్తయ్యేదా? తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదు, యూపీఏ సర్కారులో కేంద్ర కార్మికశాఖ మంత్రి పదవి ఇస్తే తెలంగాణకు ఏమీ చేయలేకపోయారు కేసీఆర్ చేసింది అన్యాయం. కనీసం రామగుండం ఎరువుల కర్మాగారం కోసం కూడా అడగలేదని లక్ష్మణ్ గుర్తుచేస్తూ విమర్శించారు.
6 నెలలకు కేబినెట్టా... అది కూడా పార్టీ కోసం ప్రజలంటే లెక్కలేని కేసీఆర్ కు కేబినెట్ సమావేశం ఏర్పాటుచేయడానికి ఆరునెలలు పట్టింది. క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల హామీలపై చర్చించకపోవటంపై ప్రజలు ప్రశ్నించాలి, 33 జిల్లాల్లో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల కోసమే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు... ఈ కేబినెట్ తీసుకున్న పెద్ద నిర్ణయం ఇదే. అదే బీజేపీ కార్యాలయాల కోసం స్థలం కావాలని అడిగితే ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ప్రభుత్వం ఉండేది టీఆర్ ఎస్ పార్టీ కోసమా? అందరి కోసమా? అని ప్రశ్నించారు లక్ష్మణ్. ఉద్యోగ కల్పన, ఆర్టీసీ, ఎన్నికల హామీలను వదిలేసి టీఆర్ ఎస్ పార్టీ సంక్షేమం కోసం కేసీఆర్ కృషిచేస్తురన్నారు.
తెలంగాణ కొత్త భవనాల కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టినా అది వృథాయే అవుతుంది. ఇపుడున్న భవనాలు. చాలు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం ఏంటి? చరిత్రాత్మక అసెంబ్లీ భవనాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి? అని బీజేపీ ప్రశ్నించింది.