Begin typing your search above and press return to search.

కేఏపాల్ రావాలి.. కరోనాను తరమాలి

By:  Tupaki Desk   |   28 April 2020 3:30 AM GMT
కేఏపాల్ రావాలి.. కరోనాను తరమాలి
X
కేఏ పాల్.. ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కం మతప్రబోధకుడు ఎక్కడ అన్నదే అందరినోట ప్రశ్నగా మారింది.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఆయన ఏపీ రాజకీయ తెరపై నుంచి కనుమరుగయ్యారు. ఎన్నికల వేళ సెగలు రాజేసి మీడియాలో హైలెట్ అయిన కేఏపాల్ ఏపీ రాజకీయాలకు దూరమయ్యారు. కరోనా కల్లోలంతో ఏపీ, తెలంగాణ సహా ప్రపంచమంతా కల్లోలంగా మారిన వేళ ఈ దేవుడి బిడ్డ.. ప్రపంచంలోని 80శాతం దేశాల అధ్యక్షులు తెలిసిన కేఏపాల్ ఏమై పోయాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల సమరంలో కేఏ పాల్ చేసిన రాజకీయ అల్లరి అంతా ఇంతా కాదు.. తెలుగులోని టాప్ న్యూస్ చానెల్స్ అన్నీ ఓవైపు ఎన్నికల వేడిలో ఆసక్తికర కథనాలను అందిస్తూ అందరూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెంట పడ్డారు. రేటింగ్ కోసం ఆయన చేసే సీరియస్ కామెడీని జనాలకు పంచారు. యూట్యూబ్ స్టార్ ను చేశారు. ఎన్నికల ప్రచారవేళ కేఏ పాల్ చేసిన హంగామా, జోకులు, కామెడీ అంతా ఇంతాకాదు.. ఏపీ ఎన్నికల వేడిలో ఇవి జనాలకు సేదతీర్చాయి. ఇలా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా మారిన కేఏ పాల్ ఎన్నికలు ముగియగానే కనిపించకుండా పోయారు.

కేఏ పాల్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన అమెరికా లో ఉన్నారు. కరోనా వేళ అమెరికాలో మరణ మృదంగం వినిపిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన బయటకు రాకుండా యూఎస్ఏ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రెగ్యులర్ గా తన టీంమేట్స్, సహచరులతో లైవ్ లోకి వచ్చి చాట్ చేస్తున్నారు.

అయితే తనకు ఎన్నో మహిమలున్నాయని.. తాను తలుచుకుంటే మూడో ప్రపంచం యుద్ధం వస్తుందని.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపగల శక్తి ఉందని.. దేవుడి దయతో తనకు సర్వశక్తులు వచ్చాయని చెప్పుకునే కేఏ పాల్ ఇంతటి క్లిష్ట సమయంలో ఎందుకు కరోనాను కంట్రోల్ చేయడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో ఉంటే అక్కడైనా కరోనా విస్తృతంగా వ్యాపిస్తోందని.. అక్కడైనా కంట్రోల్ చేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అంత శక్తిసామర్థ్యాలున్న కేఏ పాల్ బయటకొచ్చి ఒక్క మంత్రం వేస్తే కరోనా పోతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. కేఏపాల్ వెంటనే బయటకు రావాలని.. ఏపీలో విజృంభిస్తున్న కరోనాను తరిమి కొట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కనీసం కరోనాను ప్రారదోలడానికి సలహాలు అయినా ఇవ్వాలని పబ్లిక్ కోరుతున్నారు. మరి పాల్ గారు.. మీరెక్కడున్న జర బయటకు రండీ సార్..