Begin typing your search above and press return to search.

టీడీపీ నావ‌ను న‌డిపించేదెవ‌రు? ఇదో ఇంపార్టెంట్ అంశ‌మే!

By:  Tupaki Desk   |   8 Nov 2021 2:30 PM GMT
టీడీపీ నావ‌ను న‌డిపించేదెవ‌రు?  ఇదో ఇంపార్టెంట్ అంశ‌మే!
X
జాతీయ పార్టీగా ఉన్న టీడీపీని ఏపీలో న‌డిపిస్తున్న‌దెవ‌రు? అంటే.. ఇదేం ప్ర‌శ్న‌.. అంటారు. నిజ‌మే. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం ఉన్న నాయ‌కుడు.. మూడు సార్లు ముఖ్య‌మంత్రి.. చంద్ర‌బాబు ఉండ‌గా.. ఎవ‌రు న‌డిపి స్తారు? అని అంటారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ, అన్నీ చంద్ర‌బాబే చూసుకోవాల్సి రావ‌డం.. అన్ని విష‌యాల్లోనూ ఆయ‌నే వ్యూహాలు రెడీ చేసుకోవ‌డం.. అనేదే ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. నిజానికి ఫార్టీ ఇయ‌ర్స్ పార్టీకి ఇప్ప‌టికీ.. వ్యూహాలు ర‌చించేవారు... లేరంటే.. కొంత అతిగా చెబుతున్న‌ట్టు అనిపించొచ్చు.

ఉప ఎన్నిక‌లు జ‌రిగినా.. పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. లేక ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ.. వివిధ‌ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. నాయ‌కుల‌ను స‌మీక‌రించాల‌న్నా..ఏదైనా విష‌యంపై చర్చించాల‌న్నా.. అన్నీ.. చంద్ర‌బాబు చేయాల్సిందే! ఇది న‌మ్మినా.. న‌మ్మ‌క పోయినా.. వాస్త‌వం. అయితే.. దీనివ‌ల్ల వ‌చ్చే న‌ష్టం ఏంటి? అనే మాట రావొచ్చు. క్షేత్ర‌స్థాయిలో పార్టీకి సంబంధించి నిర్ణ‌యం తీసుకునే నాయ‌కులు లేక‌పోవ‌డం.. నిజంగానే పెద్ద‌మైన‌స్‌గా మారిపోయింది. ఉదాహ‌ర‌ణ‌కు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం.. కుప్పం మునిసిపాలిటీకిఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఇక్క‌డ పార్టీని న‌డిపించి.. అభ్య‌ర్థుల్లో ధైర్యం నింపి.. వైసీపీ నేత‌ల‌కు దీటుగా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్లి.. గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఈ బాధ్య‌త ఎవ‌రు తీసుకోవాలి? అనేది ఇప్పుడు స‌మ‌స్య అయింది. సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. `మాకు ఆదేశాలు లేవు` అనే మాటే వినిపిస్తోంది. నిజానికి ఇటీవ‌ల చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించారు. కానీ, ఎవ‌రినీ ఆయ‌న ఇక్క‌డ పుర‌మాయించ‌లేదు. పైగా.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌ను నియ‌మించిన‌ట్టు చెబుతున్నారు. అయితే.. ఆయ‌న‌కు స‌హ‌క‌రించే నాయ‌కా గ‌ణం ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు.

సో.. ఇక్క‌డ ఒక్క చోటే కాదు..నెల్లూరు కార్పొరేష‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ కొంద‌రు నేత‌ల‌కు చంద్ర‌బాబు స్వ‌యంగా ఫోన్ చేసి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ట‌. దీంతో లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు ఇక్క‌డ తిష్ట‌వేశారు. దీంతో అంతా చింద‌ర‌వంద‌ర‌గా ఉంద‌నే టాక్ వ‌స్తోంది. అంటే.. ఎవ‌రూ కూడా త‌మ మెద‌డుకు ప‌నిచెప్ప‌డం లేదు. కేవ‌లం.. అధినేత ఏం చెబితే అది చేయ‌డం.. ఆయ‌న మెప్పు పొంద‌డం వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు త‌ప్ప‌.. పార్టీని న‌డిపించే వ్యూహాలు కానీ.. పార్టీని ప‌ట్టించుకునే తీరిక కానీ.. నేత‌ల‌కు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో భ‌విష్య‌త్తులో పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.