Begin typing your search above and press return to search.

వేలంలో కోకాపేట భూముల్ని సొంతం చేసుకున్న వారెవరు.

By:  Tupaki Desk   |   16 July 2021 5:03 AM GMT
వేలంలో కోకాపేట భూముల్ని సొంతం చేసుకున్న వారెవరు.
X
హైదరాబాద్ మహానగరంలో ఎకరం ఎంత ఉంటుంది? అది కూడా ఐటీ హబ్ కు కాస్త దూరంగా.. రానున్న రోజుల్లో హాట్ ప్లేస్ గా మారుతుందన్న అంచనా ఉన్న కోకాపేటలో అన్నప్పుడు కొమ్ములు తిరిగి రియల్టీ సంస్థ సైతం రూ.45 కోట్ల కంటే ఎక్కువ బిడ్ పడుతుందన్న అంచనా వేయలేకపోయారు.

అందుకు భిన్నంగా.. అనూహ్యంగా ఒక ఎకరం ఏకంగా రూ.60 కోట్లకు అమ్ముడు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నిర్వహించిన వేలం హైదరాబాద్ రియాల్ ఎస్టేట్ ను మరో స్థాయికి తీసుకెళ్లిందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం రూ.60కోట్ల ధర పలికిందన్న మాట యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది. కరోనా వేళ.. ఆర్థిక రంగం కుదేల్ అయిందన్న అంచనాలతో పాటు.. తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భూముల వేలం అంతగా వర్కువుట్ కాదన్న మాటకు భిన్నంగా భారీ ఎత్తున స్పందన లభించటం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. దీంతో.. కోకాపేటలో హెచ్ఎండీఏ వద్ద ఉన్న మరో 60 ఎకరాల వేలం ప్రకటనకూడా త్వరలోనే వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.

పోటాపోటాగా సాగిన ఈ - బిడ్డింగ్ లో భారీగా ధరల్ని కొట్ చేసిన ఎనిమిది మంది తాజా వేలంలో విజేతలుగా నిలిచారు. వారు కోట్ చేసిన మొత్తాన్ని చెల్లించినంతనే సదరు భూమి వారి సొంతం కానుంది. ప్రభుత్వ వర్గాలు అంచనా వేసిన దానికంటే మించి పలికిన భూముల ధరలతో చుట్టుపక్కల భూములకు డిమాండ్ అమాంతం పెరగటమే కాదు.. భారీగా లావాదేవీలు జరిగేందుకు అవకాశం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.

గురువారం నిర్వహించిన వేలంను రెండు సెషన్లుగా నిర్వహించటంతెలిసిందే. ఉదయం 30.77 ఎకరాల్ని వేలంలో ఉంచితే.. మధ్యాహ్నం సెషన్ లో 19.17 ఎకరాలకు నిర్వహించారు. మొత్తంగా ఎనిమిది ప్లాట్లను వేలానికి ఉంచారు.

ఇందులో గరిష్ఠంగా 8.9 ఎకరాల ప్లాట్ ఉంటే.. కనిష్ఠంగా ఒక ఎకరం ఉంది. మొత్తం ఎనిమిది ప్లాట్లలో రెండు సంస్థలే 24 ఎకరాల్ని సొంతం చేసుకోవటం విశేషం. వేలంలో భూముల్ని సొంతం చేసుకున్నవన్నీ సంస్థలే కాగా.. ఒక్కటి మాత్రం వ్యక్తిగత పేరుతో బిడ్ కోట్ చేయటం గమనార్హం.

ఇంతకీ.. ఈ వేలంలో ప్లాట్లను సొంతం చేసుకన్న వారెవరన్నది చూస్తే..

క్రమ సంఖ్య విస్తీర్ణం (ఎకరాల్లో) బిడ్డింగ్ విజేత ఎకరం ఎంతంటే (రూ.కోట్లు)

1. 7.72 మన్నె సత్యనారాయణ రెడ్డి 42.2

2. 7.75 రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ 42.4

3. 7.73 అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 36.4

4. 7.56 ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ 37.8

5. 8.94 వర్సిటీ ఎడ్యుకేషన్ మెనేజ్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ 39.2

6. 7.57 అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ 39.2

7. 1 హైమ డెవలపర్స్ 31.2

8. 1.65 రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్ పీ