Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తరుఫున బరిలో ఐఏఎస్ అధికారి భార్య
By: Tupaki Desk | 8 Oct 2020 1:30 AM GMTకర్ణాటకలో సంచలనం రేపిన ఓ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య ఉదంతం ఇప్పటికీ అక్కడ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్. అలాంటి ఐఏఎస్ అధికారి భార్యను కాంగ్రెస్ బరిలో దించబోతోంది. హెచ్. కుసుమ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
2015లో బెంగళూరు కోరమంగల ప్రాంతంలోని తన నివాసంలో స్టిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి డీకే రవి ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించారు. ఆత్మహత్యగానే సీబీఐ నిర్ధారించింది. అయితే కారణాలు మాత్రం వెల్లడించారు.
అయితే రాజకీయ కక్షసాధింపు వల్లే ప్రభుత్వం చర్యల వల్లే ఆయన మరణించారనే విమర్శలను ప్రతిపక్షాలు చేశాయి. ఈ క్రమంలోనే ఆయన భార్యకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆశ్రయమిచ్చింది.
తాజాగా ఆదివారం బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో డీకేరవి భార్య హెచ్. కుసుమ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెల 3న జరిగే ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరుఫున పోలీ చేస్తున్నారు. . రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతోంది.
కాంగ్రెస్-జనతాదళ్ ఉమ్మడి అభ్యర్థిగా హెచ్. కుసుమ పోటీ పడుతోంది. ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీకి మంచి ఉంటుంది. 2018లో కాంగ్రెస్ ఈ సీటును గెలిచింది. ప్రస్తుతం ఖాళీ అయిన ఈ స్థానంలో వచ్చేనెల 3న ఉప ఎన్నిక జరుగనుంది.