Begin typing your search above and press return to search.
బీజేపీలోకి 'పెదరాయుడు' ఎంట్రీ ఇస్తారా?
By: Tupaki Desk | 11 March 2023 10:05 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. తెలంగాణలో ఈ ఏడాది చివరలో, ఏపీలో వచ్చే ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా బీజేపీ సినీ తారలపై దృష్టి సారించింది. గతంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మరో ప్రముఖ నటుడు నితిన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకప్పటి నటీమణులు విజయశాంతి, జయప్రద, జీవిత, నటుడు బాబూ మోహన్ బీజేపీలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ చేరికలను మరింత పెంచే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు సోము వీర్రాజు, మోహన్ బాబుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. మోహన్ బాబును సోము వీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు.
కాగా మోహన్ బాబు 1996లో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పలు విషయాల్లో విభేదించి టీడీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో మోహన్ బాబు ప్రచారం చేశారు. అయితే ఆయనకు ఏ పదవీ దక్కలేదు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారని ప్రచారం జరిగింది. అయితే ఏ పదవీ జగన్ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి మోహన్ బాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
అప్పటి నుంచి మోహన్ బాబు రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలసింది లేదు. సినిమా టికెట్ల ధరల పెంపు సందర్భంగా ప్రముఖ హీరోలతో సీఎం జగన్ చర్చించినప్పుడు మోహన్ బాబుకు పిలుపు రాకపోవడంపై ఆయన అసంతృప్తి చెందినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. మోహన్ బాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోము.. ఆయనను బీజేపీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో మంచు మోహన్ బాబు ఇంటికి పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు వెళ్లి ఈ మేరకు చర్చించారు. మరో మరో రెండు రోజుల్లో జరగనున్న ఏపీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు కోరేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్ధి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మద్దతుగా సోము వీర్రాజు ప్రచారం చేస్తున్నారని.. ఈ సందర్భంగా మోహన్ బాబును కలిశారని అంటున్నారు.
అయితే పార్టీలో చేరాలని సోము వీర్రాజు కోరినట్టు చెబుతున్నారు. గతంలో మోదీ ప్రధానమంత్రి అయ్యాక మోహన్ బాబు ఢిల్లీ వెళ్లి కుటుంబంతో కలిసి వచ్చారు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లోనూ ప్రధాని మోడీ తనకు అభిమానం ఉందని వెల్లడించారు. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా చేరికలను వేగవంతం చేయాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజు.. మోహన్ బాబును కలిశారని టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.