Begin typing your search above and press return to search.

వైర‌స్ సోక‌కుండా 15 నిమిషాల‌కోసారి నీళ్లు తాగాలి

By:  Tupaki Desk   |   29 May 2020 12:30 AM GMT
వైర‌స్ సోక‌కుండా 15 నిమిషాల‌కోసారి నీళ్లు తాగాలి
X
మ‌హ‌మ్మారి వైర‌స్ రాకుండా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇప్పుడు ఆ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తూ తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశాన్ని వ‌ణికిస్తోంది. ఈ క్ర‌మంలోనే స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉంటాం. మ‌న ఆరోగ్యాన్ని మ‌నం ప‌రిర‌క్షించుకుంటే స‌హ‌జంగానే దేశం ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌రో జాగ్ర‌త్త‌ను వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. స‌హ‌జంగా ఆ వైర‌స్ సోకితే గొంతునొప్పి ఉంటుంది. గొంతునొప్పి ప్రధాన ల‌క్ష‌ణం. ఈ స‌మ‌యంలోనే శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. కొంత ద‌గ్గు కూడా వ‌స్తూ ఉంటుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు వైర‌స్ సోకింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ వైర‌స్ వ‌చ్చినా రాకున్నా కొంద‌రికి ఈ స‌మ‌స్య ఉంటుంది. ఈ స‌మ‌స్య ఎవ‌రున్నా ఈపాటి జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు.

అదేమిటంటే.. ఉద‌యం లేవ‌గానే మ‌న శ్వాస‌ను మ‌నం ఒక‌సారి ప‌రీక్షించుకోవాలి. కొన్ని సెక‌న్ల పాటు గ‌ట్టిగా ఊపిరి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో ద‌గ్గు రావ‌డం.. శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైతే ఇన్‌ఫెక్ష‌న్ సోకింద‌ని భావించాలి. దీనికి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి స‌మస్య ఉంటే 15 నిమిషాల‌కు ఒక‌సారి నీళ్లు తాగాలి. ఆ నీళ్లు గుట‌క‌లు వేసిన‌ట్టు చేయాలి. అంటే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు తీసుకోవాలి. దీనివ‌ల్ల గొంతు, నోరు ఎండిపోదు. తాగునీళ్ల‌కు బ‌దులు ఇత‌ర పానియాలు మ‌జ్జిగ‌, నిమ్మ‌ర‌సం, జ్యూస్‌లు వంటివి తాగ‌వ‌చ్చు. అయితే కూల్‌డ్రింక్స్‌ను విస్మ‌రిస్తే మంచిది. ఈ విధంగా చేస్తే ఒక‌వేళ గొంతులో వైర‌స్ ఉంటే ఆ పానియాల‌కు జారిపోయి క‌డుపులోకి వెళ్తుంది. అయితే క‌డుపులోకి వెళ్తే ప్ర‌మాదం కాదా? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. అయితే క‌డుపులోకి వైర‌స్ వెళ్తే ఎలాంటి ప్ర‌మాదం లేదు. ఎందుకంటే క‌డుపులోకి వెళ్లిన వైర‌స్‌ను అక్క‌డి ర‌సాయ‌నాలు, ద్రావాలు చంపేస్తాయి. క‌డుపులోని యాసిడ్స్ వైర‌స్‌ను చంపివేస్తాయి. దీంతో ఎలాంటి భ‌యం లేదు. నీళ్ల‌ను తాగ‌క‌పోతే ఆ వైర‌స్ గొంతులో ఉంటే అక్క‌డి నుంచి శ్వాస‌నాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ వైర‌స్ తీవ్రంగా విజృంభించి మన ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అప్ర‌మ‌త్తంగా ఉండి వైర‌స్ బారి నుంచి మ‌నం, మ‌న కుటుంబాన్ని దూరంగా ఉంచితే ఆటోమేటిక్‌గా దేశం బాగుంటుంది.