Begin typing your search above and press return to search.

ప్రత్యూష ను...ప్రశంసించిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   29 Feb 2020 10:00 AM GMT
ప్రత్యూష ను...ప్రశంసించిన సీఎం జగన్
X
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు క్రీడాకారులు అగ్రపథం లో దూసుకుపోతూ, తెలుగు వారి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందిస్తున్నారు. తాజాగా ఈ జాబితా లో మరో తెలుగు తేజం చేరింది. ఏడేళ్ల వయస్సు లోనే చదరంగంలో తోలిపతకం సాధించిన ఈ తెలుగు జాతి ఆణిముత్యం.. తాజాగా ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌‌‌ ని అందుకుంది. అలాగే, ఆ హోదా అందుకున్న మూడో తొలుగమ్మాయిగా గుర్తింపు పొందింది. అసలు గ్రాండ్‌మాస్టర్‌ కావాలంటే మూడు నార్మ్‌ లు సాధించాలి. 2015లో ఉమెన్స్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్‌, 2016లో ఉమెన్స్‌ గ్రాండ్‌ మాస్టర్‌ పోటీల్లో విజయం సాధించి రెండు నార్మ్‌ లు సాధించింది. అయితే , ఆ తరువాత మూడో నార్మ్‌ కోసం ఏకంగా పదిహేనుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యి , తాజాగా బ్రిటన్‌ లో జరిగిన జిబ్రాల్టర్‌ ఓపెన్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లో మూడో నార్మ్‌ సొంతం చేసుకొని తనకలని సాధ్యం చేసుకుంది.

ఆమె మరెవరో కాదు ..తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష. ప్రపంచ వ్యాప్తంగా 126 మంది ఉమన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కిచుకున్నారు. వారిలో భారత్‌ నుంచి ఎనిమిది మాత్రమే ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత సాధించారు. ఇప్పుడు తాజాగా బొడ్డా ప్రత్యూష ఈ ఘనత సాధించి వారి సరసన నిలిచింది.

కాగా, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ప్రత్యూష తనకు గ్రాండ్ మాస్టర్ నార్మ్ వచ్చిన ఆనందాన్ని సీఎంతో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఉన్న ప్రత్యూష ఇక పై గ్రాండ్ మాస్టర్ హోదా అందుకోవడం పట్ల సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని , ప్రభుత్వం నుండి సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది అని తెలిపారు. ప్రత్యూష వెంట ఆమె తల్లిదండ్రులు కూడా సీఎం జగన్ ను కలుసుకున్నారు.