Begin typing your search above and press return to search.
ఆసీస్ తో జరిగే మూడో టెస్టులో ఆమె స్పెషల్
By: Tupaki Desk | 7 Jan 2021 8:30 AM GMTప్రస్తుతం టీమిండియా ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడో టెస్టు ప్రారంభానికి ముందే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక అరుదైన పరిణామానికి మూడో మ్యాచ్ వేదికగా నిలవనుంది. టీమిండియా.. ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడో టెస్టుకు పోలోజాక్ అనే మహిళ నాలుగో అంపైర్ గా విధులు నిర్వర్తించనున్నారు.
పురుషులు క్రికెట్లో మ్యాచ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తొలి మహిళగా 32 ఏళ్ల పోలోజాక్ ను చెప్పాలి. గతంలోనూ ఆమె పేరుతో అరుదైన రికార్డు ఉంది. 2019లో నమీబియా.. ఒమాన్ ల మధ్య ఐసీసీ డివిజన్ 2 పురుషుల వన్డే మ్యాచ్ కు అన్ ఫీల్డ్ అంఫైర్ గా విధులు నిర్వర్తించిన ఘనత ఆమె సొంతం. తాజాగా మరోసారి.. ఆమె అంపైర్ బాధ్యతల్ని నిర్వర్తించటంతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారారు.
మూడో టెస్టు మ్యాచ్ లో ఆమె ప్రత్యేకంగా నిలవనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అతిథ్య జట్టు తమ ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ అంపైర్ల నుంచి నాలుగో అంపైర్ నునియమించుకునే వీలుంది. ఈ క్రమంలోనే పాల్ జాక్ కు అవకాశం లభించింది. మ్యాచ్ ముందే ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటున్న వేళ.. ఈ టెస్టు ఏ రీతిలో జరుగుతుందో.. మరెన్ని విశేషాలకు అవకాశం ఉంటుందో చూడాలి.