Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచీ ఏది? ఎక్కడుంది. రేట్ ఎంత?
By: Tupaki Desk | 7 Dec 2022 5:10 PM GMTమార్కెట్లో 50కి, 100కు కూడా సెకన్ల వాచీలు దొరుకుతాయి. ప్లాస్టిక్ వస్తువులతో చైనా మేడ్ వస్తువులు కోఠి బజార్ లో 100కు బోలెడన్నీ దొరుకుతాయి. కానీ ఇంత చీప్ వే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ప్రపంచలోనే అత్యంత ఖరీదైన వాచీ ఏది? దాని దర ఎంత ఎంత? అది ఎక్కడుందన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు. అదే 'గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్ వాచ్'. ఇప్పటివరకు సృష్టించిన అత్యంత విలువైన వాచ్ ఇదే.
బహుళ-రంగుల డైమండ్ లతో రూపొందించిన ఈ వాచ్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది. దాదాపు $55 మిలియన్ డాలర్ల హాలూసినేషన్ వాచ్, గ్రాఫ్ డైమండ్స్ తో మొత్తం తయారు చేశారు. 110 క్యారెట్ల చాలా అరుదైన రంగుల వజ్రాలతో దీన్ని తయారు చేశారు.
ఇది స్త్రీ ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాచ్ కావడం విశేషం. భారత కరెన్సీలో దీనివిలువ ఏకంగా 451 కోట్ల రూపాయలు కాడం విశేషం. బేసెల్‌వరల్డ్ వాచ్ , జ్యువెలరీ ఫెయిర్ వ్యవధిలో ప్రదర్శించబడుతుంది.
110 క్యారెట్ల కంటే ఎక్కువ అసాధారణమైన అరుదైన రంగుల వజ్రాలతో కూడిన అద్భుతమైన కెలిడోస్కోప్ కటింగ్ వజ్రాలతో దీన్ని రూపొందించారు. గ్రాఫ్ హాలూసినేషన్ ఆభరణాల వాచ్‌మేకింగ్‌ను అపూర్వమైన కొత్త స్థాయికి ఈ వాచీ అనుభూతి తీసుకువెళుతుంది.
గ్రాఫ్ డైమండ్స్ ఛైర్మన్ లారెన్స్ గ్రాఫ్ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ ఆధారంగా, గ్రాఫ్ యొక్క అత్యంత నైపుణ్యం కలిగిన డిజైనర్లు, రత్నాల శాస్త్రవేత్తలు, మాస్టర్ క్రాఫ్ట్‌మెన్‌ల బృందం వేలాది గంటల పనిని పూర్తి చేసిన టైమ్‌పీస్ గా ఈ వాచీని చెప్పొచ్చు..
'ఇది ఖచ్చితంగా ప్రపంచంలోనే విలువైన వాచీగా ఖ్యాతికెక్కింది. "గ్రాఫ్ హాలూసినేషన్ ఒక శిల్పకళా కళాఖండం; రంగు వజ్రాల అద్భుతం యొక్క వేడుక. చాలా సంవత్సరాలుగా నేను దీన్ని సృష్టించడం గురించి ఆలోచించాను. నిజంగా చెప్పుకోదగ్గ గడియారం వజ్రాల పట్ల మనకున్న అభిరుచిని వివరిస్తుంది. మహిళల వజ్రాల కలను నిజం చేసింది." అని దీన్ని రూపొందించిన ది గ్రాఫ్ కంపెనీ పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.