Begin typing your search above and press return to search.

మన దేశంలో సంభవించిన అత్యంత ఘోర రైలు ప్రమాదాలివే

By:  Tupaki Desk   |   4 Jun 2023 2:30 PM GMT
మన దేశంలో సంభవించిన అత్యంత ఘోర రైలు ప్రమాదాలివే
X
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన దేశ ప్రజల్ని కలిచివేసింది.కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దేశంలో అత్యంత ఘోర రైలు ప్రమాదాల వివరాలు ఒకసారి చూద్దాం.

దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 800 మంది మరణించారు. ఇప్పటి వరకు జరిగిన రైళ్ల ప్రమాదాల్లో అతి పెద్ద ప్రమాదం ఇదే. జూన్‌ 6, 1981 లో జరిగింది. దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్‌ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్‌గాయ్‌ సమీపంలో బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది.

పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్‌ ఎక్స్‌ప్రెస్, గైసాల్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్‌లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్‌ పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్‌ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు.