Begin typing your search above and press return to search.
నెల్లూరులో పెద్దారెడ్ల పంచాయతీ.. చేతులు ఎత్తేసిన వైసీపీ హైకమాండ్?
By: Tupaki Desk | 17 April 2022 4:30 PM GMTగత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి.. భారీ విజయాన్ని దక్కించుకున్న నెల్లూరులో ఇప్పుడు వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. తాజా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. వర్సెస్ ప్రస్తుతం మంత్రి పగ్గాలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కేంద్రంగా రాజకీయ వివాదాలు తెరమీదికి వచ్చాయి. కాకాణిని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న అనిల్ కుమార్ యాదవ్.. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత.. కాకాణి తొలిసారి జిల్లాలో అడుగు పెడుతున్న రోజే.. పోటా పోటీగా అనిల్ సభను ఏర్పాటు చేయడం.. రాజకీయంగా వైసీపీలో రగులుతు న్న అసంతృప్తులు బయటపడేలా చేసింది.
వీరి విభేదాల చర్చ.. మూడు రోజుల నుంచి ఎక్కువైంది. మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్న కు.. అనిల్ తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. పిలవకుం డా తాను ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఆంతేకాకుండా.. వ్యంగ్య బాణాలూ విసిరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి సహకారం అందించారో.. తనపై ఎలాంటి ప్రేమ చూపారో.. కచ్చితంగా అదే ప్రేమ, సహకారం రెండింతలు అందిస్తానని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. దీంతో.. నెల్లూరు పెద్దారెడ్ల గ్రూపు రాజకీయాలు రంజుగా మారబోతున్నాయనే చర్చ అప్పుడే మొదలైంది.
అది ఏ క్షణమైనా భగ్గుమనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మంత్రి కాకాణి గోవర్ధనే రెడ్డి ఫ్లెక్సీని అధికాలు తొలగించారు. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. తొలిసారిగా గోవర్ధన్ రెడ్డి జిల్లాకు వెళ్తున్నారు. ఈ ఆదివారం మంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో.. అక్కడి మంత్రి అనుయాయులు భారీ స్థాయిలో స్వాగత ఏర్పా ట్లు చేశారు. ఇందులో భాగంగా.. కావలి నుంచి నెల్లూరు నగరం వరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమం లోనే రెండు రోజుల కిందట హరనాథ్ పురం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి తొలగించారు.
దీంతో.. వైసీపీలో దుమారం చెలరేగింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురుగా వంతెనపై కాకానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని జాతీయ రహదారుల అధికారులు క్రేన్ తో తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న కాలువగట్టుపై ఆ ఫ్లెక్సీని పడేశారు. దీంతో.. మరోవివాదానికి అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి కాకాణి ర్యాలీ, మాజీ మంత్రి అనిల్ సభ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మంత్రి రాక.. ఇటు మాజీ మంత్రి సభ నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధిష్టానం చేతులు ఎత్తేసిందా?
నెల్లూరులో టెన్షన్ వాతావరణానికి తెర దించేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. మంత్రి కాకాణి, మాజీ మంత్రి సభల నేపథ్యంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువురు నేతలు సభలు నిర్వహించుకున్నా... పరస్పర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.