Begin typing your search above and press return to search.
నీ బిల్డప్ ఏందయ్యా.. నీ వెధవ సోది ఆపు: టీడీపీ ఎంపీపై వైసీపీ నేత
By: Tupaki Desk | 1 Jun 2023 1:17 PM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం టీడీపీ పార్టీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకు సొంత పార్టీపైన, సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తూ వచ్చిన కేశినేని నాని ఇప్పుడు రూటు మార్చారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలతో రాసుకుపూసుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో కేశినేని నేని పాల్గొన్నారు. ఆయన పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలసి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తదితరులు కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ ను టీడీపీ అధిష్టానం ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించి కలకలం రేపారు.
ఇదిలా ఉంటే కేశినేని నానిపై వైసీపీ నేత, గత ఎన్నికల్లో ఆయనపై ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. ''ఏంటీ నీ వెధవసోది ఆపు.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ.. నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా'' అంటూ ఎద్దేవా చేశారు.
''దొబ్బేది బ్యాంకులని.. జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. ఇంకా ఏంటో.. ప్రజాసేవలు చేయటానికే వచ్చానంటావు. ఏంటీ నీ బిల్డప్ ఏంటయ్యా బాబూ అంటూ'' కేశినేని నానిపై పొట్లూరి వరప్రసాద్ నిప్పులు చెరిగారు. ''మన బెజవాడోళ్లందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి. వెధవ సోది ఆపి, కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికలకు దొర్లుకుంటూ వద్దువు'' అని ట్విట్టర్ లో కేశినేని నానిని ఏకేశారు.
కాగా టీడీపీ అధిష్టానం తనకు కాకుండా తన తమ్ముడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై పార్టీ చర్యలు తీసుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో కేశినేని నాని వ్యాఖ్యలపై పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్న వరప్రసాద్.. కేశినేని నాని వైసీపీలోకి వచ్చి తనకు ఎక్కడ పోటీ వస్తారోనని ఆయనపై విమర్శలు చేశారని అభిప్రాయపడుతున్నారు.